వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రిం కోర్టు... నేడు ఈడీ కస్టడీలోకి చిదంబరం ..

|
Google Oneindia TeluguNews

ఐఎన్ఎక్స్ కేసులో ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి ఈడీ కేసులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ కేసులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రిం కోర్టు నేడు తిరస్కరించింది. దీంతో గత కొద్ది రోజులుగా చిదంబరం కస్టడీలోకి తసుకోవాలని చూస్తున్న ఈడీకి ఊరట కల్గిస్తూ ఈడీ అప్పిలును అంగీకరించింది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురుఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

దీంతో సిబిఐ కస్టడి ముగిసిన తర్వాత చిదంబరాన్ని ఈడీ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో ఈ ఆర్ధిక నేరాన్ని బిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని సుప్రిం కోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు సంస్థ పక్రియపై ప్రభావం పడే అవకాశాలుంటాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ముందస్తు బెయిల్‌‌ను నిరాకరించిన కోర్టు అరెస్ట్ అనంతరం రెగ్యూలర్ బెయిల్ మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

The Supreme Court refused P Chidambaram, anticipatory bail in the INX Media case lodged by the ED,

ఇక ఇప్పటికే ఐఎన్ఎక్స్ మీడీయా కోసులో ఆగస్టు21న అరెస్ట్ చేయడంతో నేటి వరకు గురువారం వరకు సిబిఐ కస్టడీలో కొనసాగనున్నారు. అనంతరం ఈడీ తమ కస్టడీలోకి తీసుకోనుంది. ఇక కేసులో ఆర్ధికమంత్రిగా ఉన్న చిదంబరం రూ 305 కోట్లలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అక్రమంగా తరలించారని ఆరోపణలు చేస్తూ ఈడీ కేసు నమోదు చేసింది.

English summary
The Supreme Court on Thursday refused former finance minister P Chidambaram, anticipatory bail in the INX Media case lodged by the Enforcement Directorate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X