వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావో కేసులన్ని ఢిల్లీకి బదిలీ...45 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రిం సంచలన ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఉన్నావో కేసుకు సంబంధించి నమోదైన మొత్తం కేసులను 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రిం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా ప్రమాదానికి సంబంధించిన కేసును 14 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించి, విచారణ చేపట్టిన సుప్రిం కోర్టు ,అత్యాచారంపై నమోదైన మొత్తం అయిదు కేసులను ఢిల్లి కోర్టుకు బదీలి చేసింది. కాగా మొత్తం కేసులను 45 రోజుల్లోగా విచారణ జరపాలని డెడ్‌లైన్ విధించింది.

నువ్వు మాకోద్దు... కుల్దిప్ సింగ్‌ను బహిష్కరించిన బీజేపీ నువ్వు మాకోద్దు... కుల్దిప్ సింగ్‌ను బహిష్కరించిన బీజేపీ

ఉన్నావో భాదితురాలి కేసులన్ని ఢిల్లీకి కోర్టుకు బదిలీ

ఉన్నావో భాదితురాలి కేసులన్ని ఢిల్లీకి కోర్టుకు బదిలీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసును సిరియస్‌గా తీసుకున్న సుప్రిం కోర్టు అందుకు సంబంధించిన విచారణ సైతం సిరియస్‌గా కొనసాగిస్తుంది. అత్యాచార బాధితురాలి ప్రమాదాన్ని సుమోటోగా తీసుకుని నేడు విచారిస్తున్న సుప్రిం కోర్టు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న కేసులన్నింటిని ఢిల్లీ కోర్టుకు బదీలీ చేసింది.

ఫోన్లో వివరాలు సేకరించాలని ఆదేశం

ఫోన్లో వివరాలు సేకరించాలని ఆదేశం

అంతకు ముందు ఉదయం కేసు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేసులో భాగంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ప్రస్తుతం లక్నోలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. మధ్యాహ్నం 12గంటల్లోగా కోర్టు ముందు హాజరుకావడం అసాధ్యమని సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి చెప్పారు. కేసును శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు.

14 రోజుల్లో ప్రమాదంపై విచారణ

14 రోజుల్లో ప్రమాదంపై విచారణ

అయితే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించింది. సీబీఐ డైరెక్టర్ సదరు అధికారితో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తీసుకోవచ్చని సూచించింది. ఈనేపథ్యంలోనే ప్రమాదానికి సంబంధించిన కేసును ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే సిబిఐ తరపు న్యాయవాది మరింత సమయం కావాలని కోరడం దాన్ని 14 రోజులకు పెంచింది.

2017 నుండి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు

2017 నుండి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు

ఇక మొత్తం అయిదు కేసుల్లో భాదితురాలి అత్యాచారంపై నమోదైన రెండు కేసులతో పాటు భాదితురాలికి సంబంధించి తాజాగా, ప్రమాదం కేసు కాగా, బాదితురాలి తండ్రిపై నమోదైన ఆయుధాల కేసుతోపాటు ఆయన లాకప్‌డెత్‌పై నమోదైన కేసులు సైతం ఉన్నాయి.కాగా వీటన్నీంటిపై విచారణను నలబై అయిదు రోజులుగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు భాదితురాలికి ప్రభుత్వం రూ.25 లక్షలను చెల్లించాలని ఆదేశించింది.

English summary
The Supreme Court transferred all five cases related to the Unnao gangrape case to Delhi. and also set a 45-day deadline for trails in these cases to be completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X