వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ కేసులో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దావూద్ ఇబ్రహీం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పి పిటిషన్ కొట్టివేసింది.

మధ్యప్రదశ్ కు చెందిన ఒక మాజీ శాసన సభ్యుడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మీద భారతదేశంలో అనేక కేసులు నమోదు అయ్యాయని పిటిషన్ లో వివరించాడు. పలు కేసులలో నిందితుడు అయిన దావూద్ ఇబ్రహీం విదేశాలలో తలదాచుకున్నాడని వివరించాడు.

The Supreme Court today dismissed a plea filed by a former Madhya Pradesh MLA

అన్ని కేసులు ఉన్న దావూద్ ఇబ్రహీంను భారత్ తీసుకు వచ్చే విషయంలో ఇక్కడి అధికారులు ఎందుకు విఫలంఅవుతున్నారనే విషయం అర్థం కావడం లేదని పిటిషన్ లో తెలిపాడు. దావూద్ ఇబ్రహీంను భారత్ కు రప్పించే విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని మనవి చేశాడు.

సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిటి వేసి దావూద్ ఇబ్రహీం కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని మనవి చేశాడు. బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ అర్జీ విచారించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పి అర్జీ కొట్టివేసింది.

English summary
The Supreme Court today dismissed a plea filed by a former Madhya Pradesh MLA seeking court's intervention in bringing underworld don Dawood Ibrahim back to country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X