వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకకు షాక్ ఇచ్చిన తమిళనాడు: రూ. 2,480 కోట్లు పరిహారం !

తమిళనాడు ప్రభుత్వం పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకకు పెద్ద ఝలక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి మాకు రూ. 2,480 కోట్ల పరిహారం ఇప్పించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనివి చేసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకకు పెద్ద ఝలక్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి మాకు రూ. 2,480 కోట్ల పరిహారం ఇప్పించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనివి చేసింది.

<strong>రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా</strong>రాజకీయాల్లో్కి వస్తా: నన్ను ఏశక్తులు ఆపలేవు: జయ మేనకోడలు దీపా

తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ సమర్పించింది. అందులో మాకు కర్ణాటక నుంచి రూ. 2,480 కోట్ల పరిహారం ఇప్పించాలని మనవి చేసింది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం మాకు కావేరీ జలాలు విడుదల చెయ్యలేదని తమిళనాడు మనవి చేసింది.

అయితే రెండు రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సాక్షాలతో సహ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు అందుకు ఒక్క వారం గడువు ఇచ్చింది. తమిళనాడుకు ప్రతి రోజు 2,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

<strong>హెల్ఫ్: చంద్రబాబుకు లేఖ రాసిన పన్నీర్ సెల్వం, ఎందుకంటే ?</strong>హెల్ఫ్: చంద్రబాబుకు లేఖ రాసిన పన్నీర్ సెల్వం, ఎందుకంటే ?

 The Tamil Nadu government on Monday sought Rs 2,480 crore as compensation from Karnataka

కేఆర్ ఎస్ రిజర్వాయర్ లో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరుకున్నందున తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడం సాధ్యం కాదని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనవి చేసింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో అనేక ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం రూ.4,700 కోట్ల పరిహారం చెల్లించాలని కర్ణాటక ప్రభుత్వం మనవి చెయ్యడంతో కేంద్రం ఇప్పటికే రూ. 1,700 కోట్లు విడుదల చేసింది. తమిళనాడులో కరువు పరిస్థితులు తాండవం చేస్తున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

<strong>ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్ !</strong>ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్ !

కరువు తాండవంతో ఇప్పటి వరకు 170 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తమిళనాడు మీడియాలో ప్రచారం అయ్యింది. తాగునీరు సమస్య ఎదురుకావడంతో కృష్ణా జలాలు విడుదల చెయ్యాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.

English summary
The Tamil Nadu government on Monday sought Rs 2,480 crore as compensation from Karnataka. In its submission to the Supreme Court, TN government claimed that the compensation was sought since Karnataka had failed to release Cauvery water as per SC orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X