వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ప్రభుత్వం సేఫ్....! 22లో 10 ఎమ్మెల్యే స్థానాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా మోడీ మానియా మరోసారి బయటపడింది. బీజేపీ ముందు నుండి చెబుతున్నట్టుగా ఆపార్టీ సంపూర్ణ మెజారీతో అధికారంలోకి వచ్చేందుకు సిద్దమైంది. మరోసారి మోడీ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగేందుకు ఏర్పాట్లు జరుగుతున్న్నాయి. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రానుండడంతో దక్షిణాదిలో జరిగిన ఉప ఎన్నికలు ఫలితాలు జరిగిన తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర్రాల్లో కూడ పొలిటికల్ సీన్ మారనుంది. కర్ణాటకలో బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉండగా తమిళనాడులో మాత్రం మరో రెండు సంవత్సరాల పాటు తమిళనాడు ప్రభుత్వం సేఫ్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!

 తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కష్టకాలం

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కష్టకాలం

పార్లమెంట్ సీట్లలో ప్రతిపక్ష పార్టీల హవాకొనసాగిన నేపథ్యంలో అక్కడ మొత్తం 22 రాష్ట్ర్ర అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి..ఈ ఉప ఎన్నికలతో ముఖ్యమంత్రి పళని స్వామి ప్రభుత్వ భవిష్యత్ కూడ తేలనుంది. ఈనేపథ్యంలోనే మొత్తం తమిళనాడులో 234 స్థానాలు ఉండగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు 114 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాగా ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 98 స్థానాలు ఉన్నాయి.

ఏఐఏడిఎంకే బలాన్ని చేకూర్చిన ఉప ఎన్నికలు

ఏఐఏడిఎంకే బలాన్ని చేకూర్చిన ఉప ఎన్నికలు

ఇక ప్రస్థుతం జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 22 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు చూస్తే మొత్తం 22 స్థానాలకు గాను అధికార అన్నాడీఎంకే 10 స్థానాల్లో లీడ్‌లో ఉండి గెలుపు దిశలో ఉండగా, 12 స్థానాల్లో డీఎంకే పార్టీ లీడ్‌లో ఉంది. వాస్తవానికి మరో 4స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ఉప ఎన్నికల్లో మరో ఆరు సీట్లు అదనంగా గెలుచుకుంది.సో దీంతో అన్నాడీఎంకే అధికారంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడులో ఎన్నికల్లో పుంజుకున్న డీఎంకే

తమిళనాడులో ఎన్నికల్లో పుంజుకున్న డీఎంకే


ప్రతిపక్ష డీఎంకేకు ప్రస్తుతం 98 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలుపోందడంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడ 110 స్థానాలకు చేరుకుంది. అయితే మరోవైపు అధికార పార్టీ నుండి కూడ ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు డీఎంకేకు మద్దతు పలికేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే అధికార అన్నాడీఎంకు కొంత ఇబ్బందికర పరిణామాలు కనిపిస్తున్నాయి.

 కేంద్రం అండతో పళనికి భరోసా

కేంద్రం అండతో పళనికి భరోసా

అయితే అన్నాడీఎంకే బీజేపీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో కేంద్రంలో బీజేపీ అధికారినికి రావడం ముఖ్యమంత్రి పళని స్వామీకి కోంత కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా రాష్ట్ర్ర ప్రభుత్వాల మార్పుల్లో గవర్నర్ పాత్ర కీలకంగా ఉండనుంది.

English summary
Celebrations begin outside DMK headquarters in Chennai. As per the latest trends available on the Election Commission of India website, DMK is leading on 22 seats
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X