• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో.. వ్యభిచారానికి సాంకేతికత అనుసంధానం..! ఎంత కేటుగాళ్లో...!

|

అమరావతి/హైదరాబాద్ : అమ్మాయిన బలహీనలతను ఆసరా చేసుకుని, పెట్టుబడి లేని వ్యాపారంగా భావించి కొంత మంది కేటుగాళ్లు వ్యభిచారం అనే వృత్తిని ప్రధాన జీవనాధారంగా చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. వ్యభిచారం చట్టరీత్యా నేరం కాబట్టి, ఎంత గుట్టుగా నిర్వహించాలో అంతే గుట్టుగా ఈ వ్యవహారాన్ని అంతర్రాష్ట్ర వ్యాపారంగా కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. భాషతో పెద్దగా ఇబ్బందులు తలెత్తని వ్యాపారం కావడంతో మొత్తం ఆన్ లైన్ లోనే వ్యహారాన్ని చక్కబెడుతున్నారు నిర్వాహకులు. అందుకోసం అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఆన్ లైన్ రూపంలో చేరవేసి చట్టానికి దొరకకుండా తప్పించుకుతిరుగుతున్నారు దందా రాయుళ్లు. విశాఖ పట్నం కేంద్రంగా అచ్చం ఇలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది.

 కొత్త పద్దతిలో వ్యభిచారం..! సాంకేతికతను విరివిగా వాడుకుంటున్న నిర్వాహకులు..!!

కొత్త పద్దతిలో వ్యభిచారం..! సాంకేతికతను విరివిగా వాడుకుంటున్న నిర్వాహకులు..!!

వ్యభిచారం నిర్వహించడంలో కూడా నూతన అధునాత పద్దతులను ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. మూడో వ్యక్తికి తెలియకుండా సాంకేతికతను అనుసందావనం చేస్తూ పర్ ఫెక్టుగా వ్యభిచార వృత్తిని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రాల సరిహద్దులు కూడా దాటుతూ కేవలం ఆన్ లైన్ లోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్దతిని పాటిస్తున్నారు. వేశ్యలకు సమాచారం అందించే క్రమం నుంచి, స్టార్ హోటల్స్ లో రూంల బుకింగ్ వరకూ అంతా గోప్యత పాటిస్తూ మొత్తం ఆన్ లైన్ వ్యవహారాన్ని ఉపయోగిస్తున్నారు కేటుగాల్లు. గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా హైటెక్‌ పద్ధతిలో వ్యభిచారం నడిపిస్తుంది.

 అందమైన అమ్మాయిలే పెట్టుబడి..! అంతా ఆన్ లైన్ లోనే..!!

అందమైన అమ్మాయిలే పెట్టుబడి..! అంతా ఆన్ లైన్ లోనే..!!

ఎవరూ ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. అన్ని సింపుల్ గా ఆన్లైన్లోనే జరిగిపోతాయి. కేవలం కావాల్సిన వివరాలు మాత్రమే పంపుతారు అది కూడా ఆన్లైన్లోనే..ఇలా ప్రతి చిన్న విషయం నుండి అన్ని ఆన్లైన్లో నడిపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. కాగా విశాఖపట్నం టూ టౌన్ పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. ఇక పోలీసుల వివరాల ప్రకారం, ముంబైకి చెందిన యువతి హైదరాబాద్‌ నుంచి ఈనెల 20న, బెంగళూరుకి చెందిన యువతి కోల్‌కతా నుంచి ఈనెల 22న విమానంలో విశాఖపట్నానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్‌ హోటల్‌కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్‌ చేసి వున్న గదుల్లో దిగారు.

 అనుమనం వస్తేనే దొంగలు..! లేకపోతే దొరలే..!!

అనుమనం వస్తేనే దొంగలు..! లేకపోతే దొరలే..!!

ఐతే హోటల్‌లోని వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈనెల ఇరవై రెండున టూటౌన్‌ సీఐ సీహెచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హోటల్‌పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. విటులు మాత్రం కొద్దిసేపటికి ముందే బయటకు వెళ్లిపోవడంతో తప్పించుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఈ వ్యవహారం గుట్టు విప్పారు. తమకు రిషి అనే వ్యక్తి మాత్రమే తెలుసునని, అంతా ఆయనకే తెలుసని, ఆయన చెప్పినట్టు తాము చేస్తామని తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లాలనేది ఫోన్‌లోనే చెబుతాడని, తమకు విమానం టిక్కెట్లు కూడా అతనే బుక్‌ చేసి మెయిల్‌ చేసేస్తాడని వివరించారు.

 విమానాల్లో ప్రయాణం.. స్టార్ హోటళ్లలో బస..! అంతా గుటు చప్పుడు కాకుండానే..!!

విమానాల్లో ప్రయాణం.. స్టార్ హోటళ్లలో బస..! అంతా గుటు చప్పుడు కాకుండానే..!!

ఏ నగరానికి వెళ్లినా అక్కడ హోటల్‌ రూమ్‌ నుంచి కారు వరకూ అన్నీ బుక్‌ చేసి తమ ఫోన్‌కు వాటి వివరాలు మెసేజ్‌ చేస్తాడని తెలిపారు. ఏ నగరానికి వెళ్లినా రెండు రోజులు మాత్రమే వుంటామని, తర్వాత రూమ్‌ ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంటామని వివరించారు. ఒక్కో విటుడికి రూ.1,500 చొప్పున తమ ఖాతాకు జమ చేస్తాడని పట్టుబడిన యువతులు వివరించారు. విటులు కూడా నేరుగా రిషినే సంప్రదిస్తారని, వారి పేరును మాత్రం తమకు ఫోన్‌ చేసి చెబుతాడని చెప్పడం గమనార్హం. అంటే నిర్వాహకుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత పకడ్బందీగా ఉపయోగిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు అన్న మాట.

English summary
Some of the people are going through the profession of prostitution as a major source of livelihood, as they are a business without investment. Since prostitution is a crime of law, the issue is being continued as an interstate business as much as it is to be conducted. As a business that does not have much trouble with the language, the whole line is online. And they are using the most advanced technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X