వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లుంగీ డ్యాన్స్ కంటే దమ్ములేపుతున్న లుంగీ క్యూ ఫోటో

సామాన్య ప్రజల కష్టాలు గుర్తించిన కొందరు కేంద్ర ప్రభుత్వం మీదమండి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

కోజికోడ్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది సోషల్ మీడియాలో ఎన్నో జోకులు వేయ్యడంతో అవి హల్ చెల్ చేస్తున్నాయి.

సామాన్య ప్రజల కష్టాలు గుర్తించిన కొందరు కేంద్ర ప్రభుత్వం మీదమండి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే వీటన్నింటికన్నా ఇటీవల ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చిన లుంగీ క్యూ ఫోటో మాత్రం రికార్డు సృష్టించింది.

దాదాపుగా అందరూ లుంగీలు కట్టుకుని ఒకే చోట రెండు క్యూలలో నిలబడ్డారు. అందులో ఓ క్యూలో ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి నిలబడి ఉన్నారు. మరొ క్యూలో మాత్రం మందుబాబులు బ్రాందీ, విస్కీ తీసోకోవడానికి నిలబడి ఉన్నారు.

సోషల్ మీడియాలో ఆ ఫోటోను చూసిన వారు ఇలా జోకులు వేస్తున్నారు. ప్రధాని మోడీ గారు మద్యం షాపుల్లో పాత రూ.1,000, రూ. 500 నోట్లు తీసుకోవాలని చెప్పండి, లేదా బ్యాంకుల్లో మద్యం విక్రయించాలని చెప్పండి, అంతే కానీ రోజూ ఇలా మేము రెండు క్యూలలో నిలబడలేం అంటూ ఆ ఫోటోను షేర్ చేసుకుంటున్నారు.

ఈ ఫోటో కేరళలోని కోజికోడ్ లో తీసింది. మద్యం దుకాణం బోర్డు మీద మలయాళంలో విదేశ మద్యం అని రాసి ఉంది. విచిత్రమేమిటంటే ఏటీఎంలో డబ్బులు తీసుకునే వారి క్యూ కంటే మందు బాబుల క్యూ చాల ఎక్కువగా ఉన్న విషయం స్పష్టంగా కనపడుతుంది.

ఈ ఫోటో కేరళలోని దిన పత్రికల్లో చూసిన కోజికోడ్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ నాయర్ సంచలనం రేపే ఓ కామెంట్ తో ఆయన ఫేస్ బుక్ ఈ ఫోటోను షేర్ చేశారు. ఆ కామెంట్ తో ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆయన కామెంట్ అందరిని ఆకట్టుకుంది.

ఏటీఎం ముందు క్యూలో ఉన్న వారు లుంగీకు కిందకు దించి మర్యాదగా నిలబడి ఉన్నారని, అయితే మద్యం షాప్ ముందు ఉన్న క్యూలో లుంగీలు ఎత్తికట్టుకుని నిలబడి ఉన్నారని ఆయన చేసిన కామెంట్ పేలింది.

కేరళలో పవిత్ర ప్రదేశాలు, దేవాలయాలకు వెళ్లినప్పుడు మర్యాదగా లుంగీలు కిందకు కట్టుకుని ఉంటారు. అది అక్కడి సాంప్రదాయం. అదే ఇతర ప్రాంతాలకు వెలితే లుంగీలు ఎత్తికట్టుకుని ఉంటారు.

మొత్తం మీద ఏటీఎం కేంద్రాల దగ్గర డబ్బులు తీసుకునే వారికంటే కేరళలో మద్యం షాప్ ల దగ్గర మద్యం తీసుకోవడానికి నిలబడే వారి క్యూ ఎక్కువగా ఉంటుందని ఈ ఫోటో నిరూపించింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

English summary
Not only was the line at the liquor shop longer, the people lining up for ATM had lungis unfolded, those outside the liquor shop had theirs folded up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X