వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ర్యాలీలో వందేమాతరం గీతం: సగంలో ఆపేసిన రాహుల్ గాంధీ, ప్రధాని, (వీడియో)

|
Google Oneindia TeluguNews

మంగళూరు/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దేశభక్తి గీతం అయిన వందేమాతరం గీతం పాడుతున్న సమయంలో సమయం లేదని సగంలో ఆపివేయడంతో రాహుల్ గాంధీ మీద ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ర్యాలీ ఆలస్యం

ర్యాలీ ఆలస్యం

ఎన్నికల ప్రచారం సందర్బంగా శుక్రవారం మంగళూరు సమీపంలోని బంట్వాళలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అనుకున్న సమయానికంటే కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఆ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని నిర్ణయించారు.

వందేమాతరం అవసరమా!

వందేమాతరం అవసరమా!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేదిక మీదకు వచ్చిన వెంటనే కార్యక్రమం నిర్వహకులు గాయకులు దేశభక్తి గీతం వందేమాతరం పాడుతారని చెప్పారు. ఆ సందర్బంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ వైపు వాచ్ చూపిస్తూ టైం లేదు, వందేమాతరం గీతం అవసరామా ? అని ప్రశ్నించారు.

సీఎం సిద్దూ మౌనం

సీఎం సిద్దూ మౌనం

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ చార్జ్ వేణుగోపాల్ కార్యక్రమం నిర్వహకుల దగ్గరకు వెళ్లి దగ్గరకు వెళ్లి రెండు మూడు ముక్కలు పాడించి సగంలో నిలిపివేయాలని సూచించారు. వందేమాతం గీతం పాడుతున్న గాయకులు సగంలోనే నిలిపి వేసి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ పక్కనే ఉన్న సీఎం సిద్దరామయ్యతో సహ ఒక్కరూ వందేమాతరం గీతం పూర్తి చెయ్యాలని చెప్పకపోవడంతో కార్యకర్తలు షాక్ కు గురైనారు.

ప్రధాని అయితే ఉద్దరిస్తారా!

దేశభక్తి గీతం వందేమాతరం గీతం పూర్తి కాకుండానే రాహుల్ గాంధీ సగంలో ఆపివేశారని మీడియాలో వార్తలు రావడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. దేశభక్తి గీతం పూర్తిగా వినలేని రాహుల్ గాంధీ భారతదేశం ప్రధాని అయతే ప్రజలను ఉద్దరిస్తారా ? ప్రతిపక్షాలను విమర్శించే సమయం దేశభక్తి గీతం వినడానికి లేదా అని ప్రశ్నిస్తున్నారు. వందేమాతరం గీతాన్ని అవమానించిన రాహుల్ గాంధీ బీజేపీ నాయకులకు అడ్డంగా బుక్కయ్యాడు.

English summary
Karnataka assembly elections 2018: The Vande Mataram song has been cut to half at the Congress rally in Bantwal today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X