వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాంమందిర నిర్మాణంపై మోడీకి లేఖ ..వీహెచ్‌పీ.. కేసును త్వరగా తేల్చాలంటూ సీజేకు విన్నపం

|
Google Oneindia TeluguNews

రామమందిర నిర్మాణంపై ఓవైపు శివసేన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే తాజగా విశ్వహిందు పరిషత్ సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే హర్యానాలో సమావేశమైన కేంద్రీయ మార్గదర్శక్ మండలి తీర్మాణాన్ని చేసింది.రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాలు ముగిసిన అనంతరం రామ మందిరం పునర్‌నిర్మాణం చేయాలంటూ వీహెపీ తీర్మాణాన్ని చేసింది. కాగా తీర్మాణం కాపీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపుతామని తెలిపింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న సుప్రిం కోర్టు చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్‌కు కూడ కేసును త్వరగా విచారణ చేపట్టి వివాదానికి తెర దించాలని విహ్‌పీ కోరింది.

The VHP has decided to build pressure on the BJP or the construction of the Ram temple

2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీలు, శివసేన,విహెచ్‌పీలు పావులు కదుపుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇటివల అయోధ్య ను సందర్శించిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే రామ మందిర నిర్మాణంపై పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.. కాగా ఇదివరకే ఉద్దవ్ ఠాక్రే అయోధ్యను సందర్శించి రాంమందిర నిర్మాణం చేపట్టాని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు.

ఇందులో భాగంగానే 18మంది ఎంపీల బృందంతో కలిసి రామాలయాన్ని ఉద్దవ్ ఠాక్రే సందర్శించాడు. దీంతో రామమందిర నిర్మాణం చేపట్టాలని ప్రధానమంత్రి మోడీపై ఒత్తిడి తేనున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం రామ మందిర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. మందిరాన్ని నిర్మించాలని ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తామని అన్నారు. మరోవైపు మహరాష్ట్ర్రలో వచ్చే ఎన్నికలు ఉండడం కూడ శివసేన పావులు కదుపుతోంది.

English summary
The Vishva Hindu Parishad has decided to build pressure on the Bharatiya Janata Party for the construction of Ram Mandir in Ayodhya.the VHP passed a resolution pushing for the onstruction of the Ram temple in Ayodhya that will be submitted to Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X