India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం తాగొచ్చి వేధిస్తున్న భర్త; పండుగనాడే రోకలి బండతో మోది, పెట్రోల్ పోసి తగులబెట్టిన భార్య

|
Google Oneindia TeluguNews

ప్రతి రోజూ తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్త వేధింపులను తట్టుకోలేక పోయిన ఓ భార్య అతని ప్రాణాలు తీసింది. పండుగ రోజు కూడా ఫుల్లుగా తాగొచ్చి తనతో గొడవకు దిగిన భర్తపై ఎదురు దాడి చేసిన భార్య విచక్షణా రహితంగా రోకలిబండతో బాది, ఆపై భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెళితే

 మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తున్న భర్త

మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తున్న భర్త


ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ రామ్ నగర్ కు చెందిన చిరంజీవి, అంకాళమ్మ పదేళ్ల క్రితం వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా అంకాళమ్మ భర్త చిరంజీవి నిత్యం మద్యం తాగి వస్తూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక తాజాగా కనుమ పండుగ రోజు కూడా ఫుల్లుగా మద్యం తాగించి భార్యతో గొడవ పెట్టుకున్నాడు చిరంజీవి. దీంతో భర్త వేధింపులు భరించలేని అంకాళమ్మ మహంకాళి గా మారిపోయింది. భర్తపై ఎదురుదాడికి దిగింది.

రోకలి బండతో దాడి చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టి హతమార్చిన భార్య

రోకలి బండతో దాడి చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టి హతమార్చిన భార్య

భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో తనపై భర్త దాష్టీకాన్ని భరించలేక పోతున్న అంకాళమ్మ రోకలి బండ తీసుకుని భర్తను బాది వదిలిపెట్టింది. ఆపై పెట్రోల్ పోసి భర్తకు నిప్పంటించింది. దీంతో భర్త చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను హతమార్చిన అనంతరం అంకాళమ్మ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను తానే చంపానని పోలీసుల ఎదుట చెప్పి లొంగిపోయింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్తను చంపిన భార్య అంకాళమ్మ పై కేసు నమోదు చేసి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

అనాధలుగా మారిన ముగ్గురు పిల్లలు

అనాధలుగా మారిన ముగ్గురు పిల్లలు

మద్యం తాగించి ప్రతిరోజు భార్యతో గొడవ పెట్టుకున్న భర్త, చిత్రహింసలకు గురి చేసిన భర్త తప్పు చేస్తే, తనను హింసిస్తున్నాడు అని కోపంతో భర్తను హతమార్చి భార్య అంకాళమ్మ కూడా మరో పెద్ద తప్పు చేసింది. ఇక ఈ కేసులో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారడం స్థానికంగా ఉన్న వారిని ఆవేదనకు గురి చేసింది. భార్య చేతిలో హతమైన భర్త లేకుండా పోతే, భర్తను చంపిన భార్య కటకటాలపాలయ్యింది. ముగ్గురు పిల్లలను సక్రమంగా పెంచాల్సిన బాధ్యత ఉన్న తల్లిదండ్రులు చేసిన పని ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. దిక్కుతోచని స్థితిలో అంకాళమ్మ పిల్లలు అమ్మ నాన్నల కోసం రోదిస్తున్నారు.

స్త్రీలలో నశిస్తున్న సహనం .. పెరిగిన నేరప్రవృత్తి

స్త్రీలలో నశిస్తున్న సహనం .. పెరిగిన నేరప్రవృత్తి

కారణాలేవైనా ఇటీవల కాలంలో స్త్రీలలోనూ సహనం నశించిపోతుంది. గతంతో పోలిస్తే మహిళలు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. భార్యలను చంపే భర్తలే కాదు భర్తలను హతమారుస్తున్న భార్యల సంఖ్య కూడా పెరిగిపోతోంది. మహిలలలోనూ ఒకింత నేర ప్రవృత్తి పెరుగుతుంది. ఒకప్పుడు ఇటువంటి దారుణాలకు మగవాళ్లు మాత్రమే పాల్పడితే, ఇప్పుడు ఆడ వాళ్ళు కూడా తామేమీ తీసిపోము అన్న చందంగా భర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా అత్యంత దారుణంగా భర్తల ప్రాణాలు తీస్తున్నారు.

English summary
Wife kills a drunkard husband. with the harassment of husband the wife hit her husband with a rock, poured petrol on him and set him on fire. The incident took place in Prakasam district Giddaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X