వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ జిల్లా పరిషత్ స్కూలు టీచర్ కు గ్లోబల్ టీచర్ అవార్డు .. విశ్వగురువుగా గుర్తింపు .. రూ. 7కోట్ల నగదు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రపంచం మెచ్చిన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర జిల్లాపరిషత్ పాఠశాలలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా 31 ఏళ్ల రంజిత్‌సిన్హ్ దిసాలే కు బోధనలో ఆవిష్కరణలకు గానూ గ్లోబల్ ట్రీ టీచర్ ప్రైస్ 2020 దక్కింది. ప్రతిష్టాత్మక $ 1 మిలియన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతదేశం నుండి మొదటి ఉపాధ్యాయుడిగా ఆయన ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.ఈ అవార్డును లండన్‌కు చెందిన వర్కీ ఫౌండేషన్ మరియు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) సంయుక్తంగా అందిస్తున్నాయి.

సహజీవనం తప్పు కాదు .. తల్లిదండ్రులకు జోక్యం చేసుకునే హక్కు లేదన్న హైకోర్టుసహజీవనం తప్పు కాదు .. తల్లిదండ్రులకు జోక్యం చేసుకునే హక్కు లేదన్న హైకోర్టు

క్యూఆర్ కోడ్ ద్వారా పాఠాలను చెప్పే విధానం .. సూపర్ టాలెంట్ , మంచి మనసు కూడా

క్యూఆర్ కోడ్ ద్వారా పాఠాలను చెప్పే విధానం .. సూపర్ టాలెంట్ , మంచి మనసు కూడా

మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా పరిదేవాడి గ్రామంలో ప్రాథమిక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన అక్కడ విద్యార్థులకు విద్య బోధించడం కోస నూతన మార్గాలను అన్వేషించే వారు. ఈ తపన ఆయనను విశ్వ గురువుగా నిలబెట్టింది. రంజిత్ సిన్హా టీచర్ గా అడుగుపెట్టిన ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుని, విద్యార్థులు పాఠశాలకు రాక ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. అయితే ఆ పరిస్థితులు మార్చాలి అనుకున్న ఉపాధ్యాయుడు శిధిలావస్థలో ఉన్న స్కూల్ భవనాన్ని బాగుచేయడంతో పాటుగా, పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠాలను విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలాగా వీడియోలు, ఆడియోలు ,కథల రూపంలో, క్యూఆర్ కోడ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి అందించే ప్రయత్నం చేశారు.

బాల్య వివాహాలను అరికట్టటానికి , బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

బాల్య వివాహాలను అరికట్టటానికి , బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

ఈ ప్రయత్నంలో మంచి ఫలితాలను కూడా రాబట్టారు. అంతేకాదు అక్కడ స్కూల్స్ కు విద్యార్థులు రాని పరిస్థితులను గుర్తించి ముఖ్యంగా బాల్య వివాహాలను ఆపడానికి, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ గెలుచుకున్న దిసాలే బహుమతి డబ్బును తన ప్రాజెక్ట్ కోసం ఉపయోగించాలనుకుంటున్నానని అలాగే మిగతా ఉపాధ్యాయుల ఆవిష్కరణకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగంలో, తన తోటి టాప్ 10 ఫైనలిస్టులతో సగం బహుమతి డబ్బును పంచుకుంటానని సంచలన ప్రకటన చేసాడు.

 తనతోటి సహా ఫైనలిస్ట్ ఉపాధ్యాయులతో అవార్డ్ మొత్తంలో సగం పంచుకుంటానన్న టీచర్

తనతోటి సహా ఫైనలిస్ట్ ఉపాధ్యాయులతో అవార్డ్ మొత్తంలో సగం పంచుకుంటానన్న టీచర్

ఫలితంగా మిగిలిన తొమ్మిది మంది ఫైనలిస్టులు ఒక్కొక్కరు 55,000 డాలర్లు అందుకున్నారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ యొక్క ఆరేళ్ల చరిత్రలో మొత్తం విజేత బహుమతి డబ్బును ఇతర ఫైనలిస్టులతో పంచుకోవడం ఇదే మొదటిసారి అని వర్కీ ఫౌండేషన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. 2014 నుండి బహుమతిని ప్రోత్సహించిన ఫౌండేషన్, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దిసాలే విద్యార్థినుల జీవితాలను మార్చి వేశారని కొనియాడారు. విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించే దిసాలే ప్రయాణం 2009 లో ప్రారంభమైందని తెలుస్తుంది .

 యుద్ధ బాధిత దేశాల నుండి5,000 మంది విద్యార్థులను శాంతి మార్గంలో నడిపే పనిలో దిసాలే

యుద్ధ బాధిత దేశాల నుండి5,000 మంది విద్యార్థులను శాంతి మార్గంలో నడిపే పనిలో దిసాలే

పాఠ్యపుస్తకాల్లోని క్యూఆర్ సంకేతాలు వంటి వినూత్న పద్ధతుల సహాయంతో మెరుగైన విద్యా ఫలితాలను సాధించడంలో ఆయన కృషి ప్రపంచవ్యాప్తంగా చదువు గొప్పతనాన్ని గుర్తించే వారికి తెలిసిందని తాను సంతోషంగా ఉన్నాను అని దిసాలే చెప్పారు. 2017 నుండి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు . భారతదేశం మరియు పాకిస్తాన్ విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంపొందించే ఉద్దేశంతో, ఆయన రెండు దేశాల విద్యార్థులతో ఆన్‌లైన్ వీడియో సెషన్లను నిర్వహిస్తున్నాడు. ప్రతి సంవత్సరం, ప్రపంచంలోని యుద్ధ బాధిత దేశాల నుండి కనీసం 5,000 మంది విద్యార్థులను శాంతి మార్గంలో నడిచేలా చూడాలని దిసాలే కోరుకుంటున్నారు.

English summary
It is a proud moment for the zilla parishad schools in Maharashtra, as one of their educators, 31-year-old Ranjitsinh Disale, has become the first teacher from India to win the prestigious $1-million Global Teacher Prize for innovation in teaching. The award is bestowed by London-based Varkey Foundation and the United Nations Educational, Scientific and Cultural Organization (Unesco). The winners were announced by actor-writer Stephen Fry in an online ceremony from the Natural History Museum, London,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X