వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పార్లమెంటులోనే ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారు’

|
Google Oneindia TeluguNews

రూర్కీ: భారతీయ జనతా పార్టీ ఎంపి, విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంటులో ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారని ఆమె ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానం దోషి అని నిర్ధారించిన వారికి మద్దతుగా మాట్లాడేవారిపై ఆమె మండిపడ్డారు.

కోర్టులు దోషి అని నిర్ధారించిన వారిని వెనుకేసుకొచ్చేందుకు యత్నించిన ఒకరిద్దరు ఎంపీలు ఉగ్రవాదులేనని ఆమె చెప్పారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన వారిని కూడా శిక్షించాల్సిందేనని అన్నారు.

‘కొందరు నాయకులు యాకుబ్ మెమన్ ఉరి తర్వాత ఏడుస్తున్నారు. ఎలాగంటే.. రావణసురుడి మృతి తర్వాత మండోదరి ఏడ్చినట్లుగా' అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆమె యాకుబ్ మెమన్‌ను సమర్థించిన శతృజ్ఞ సిన్హా, శశిథరూర్ తదితరులను ఆమె ప్రస్తావించి ఉంటారని భావిస్తున్నారు.

'There are 1-2 terrorists in the Parliament': Sadhvi Prachi

జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపైనా ఆమె స్పందించారు. ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాదిని విచారించిన తర్వాత అతడ్ని ఏదైనా హిందూ సంస్థకు అప్పగించాలని కోరారు.

పాకిస్థాన్‍కు చెందిన ఇద్దరు బిఎస్‌ఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడి ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవగా, మరో ఉగ్రవాదిని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. ‘హిందువులను చంపడం నాకు సరదా' అని ఉగ్రవాది నవేద్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వి ప్రాచీ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఉగ్రవాదులపైనే తమ పోరు అని చెప్పారు.

English summary
Vishwa Hindu Parishad (VHP) leader Sadhvi Prachi is at it again. This time she has stoked a fresh controversy by claiming that there are one or two terrorists in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X