బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక బంద్: బీజేపీ నాయకులకు నిరాశ, బెంగళూరులో, ఎదురు తిరుగుతున్న ప్రజలు, ఆందోళన!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక బంద్ కు మిశ్రమ స్పంధన

బెంగళూరు: రైతుల రుణమాఫి చెయ్యాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మే 28 సోమవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చింది. కర్ణాటక బంద్ కు మిశ్రమ స్పంధన వచ్చింది. ఎప్పటిలాగే ప్రజలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ బస్సులు సంచరిస్తున్నాయి. అన్ని షాపులు తీశారు. వ్యాపారలావాదేవీలు కొనసాగుతున్నాయి. బంద్ కు ప్రజలు ఎదురుతిరగడంతో బీజేపీ నాయకులు నిరాశకు గురైనారు.

బీజేపీ ఆధిపత్యం

బీజేపీ ఆధిపత్యం

బీజేపీ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో షాపులు మూతపడ్డాయి. బీజేపీ కార్యకర్తలు కేఎస్ఆర్ టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. బలవంతంగా షాపులుమూయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

ఆంధ్రా సరిహద్దు

ఆంధ్రా సరిహద్దు

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన చిక్కబళ్లాపుర, కోలారు జిల్లాల్లో బంద్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఎప్పటిలాగే బస్సులు సంచరిస్తున్నాయి. వ్యాపారలావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఎప్పటిలాగే సంచరిస్తున్నారు.

సీఎం సొంత జిల్లా

సీఎం సొంత జిల్లా

హెచ్.డి. కుమారస్వామి సొంత జిల్లా అయిన హాసన్ లో బంద్ ప్రభావం ఏమాత్రం కనపడటం లేదు. కేఎస్ఆర్ టీసీ బస్సులు, ఆటోలు సంచరిస్తున్నాయి. తుమకూరు జిల్లాలో సైతం బంద్ ప్రభావం కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు నిరాశకు గురైనారు.

బెంగళూరు ఎయిర్ పోర్టు

బెంగళూరు ఎయిర్ పోర్టు

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గరికి ఎప్పటిలాగే ట్యాక్సీలు, క్యాబ్ లు, బీఎంటీసీకి చెందిన వాయువజ్రా వోల్వో బస్సులు సంచరిస్తున్నాయి. పలుప్రాంతాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యం చేరుకుంటున్నారు.

బెంగళూరు బంద్

బెంగళూరు బంద్

బెంగళూరు నగరంలో బంద్ వాతావరణం ఏమాత్రం కనిపించలేదు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బలవంతంగా షాపులు మూయించడానికి ప్రయత్నించడంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రజలు ఎదురుతిరుగుతున్నారు. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కు మిశ్రమ స్పంధన ఎదురుకావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురైనారు.

English summary
There is dull response to the karnataka bandh called for demanding waiving of formers loan. Protests are being held at some district where BJP has strong hold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X