• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ ఇద్దరు మహిళల ఎంట్రీ పక్కా ప్లానా?.. శబరిమల దర్శనంలో కొత్త కోణం

|
  Sabarimala Women Entry : Two Women Didn't Walk By 18 Padi Stairs & No Irumudi on Their Heads

  కేరళ : ఇద్దరు మహిళల అయ్యప్ప ఆలయ దర్శనం వెనుక ఎన్నో అనుమానాలు. మరెన్నో కథనాలు. వెరసి కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దర్శనభాగ్యానికి తెర తీశారా? తెల్లవారుజామున ఆలయ ప్రవేశం హడావిడిగా ఎందుకు జరిగినట్లు. భక్తజన సందోహం తక్కువగా ఉన్న సమయంలో ఆ ఇద్దరికి ఎంట్రీ ఇవ్వడమేంటి? ఇలాంటి ప్రశ్నలకు దొరుకుతున్న సమాధానాలు వింతగా ఉన్నాయి.

  బుధవారం తెల్లవారుజామున శబరిమల అయ్యప్ప సన్నిధిలోకి మహిళలు ప్రవేశించడం వివాదస్పదమైంది. అయితే వీరిద్దరు ఆలయంలోకి రావడం వెనుక అసలేం జరిగిందనేది చర్చానీయాంశమైంది. ఎంతోమంది మహిళలు అయ్యప్ప దర్శనానికి వచ్చినా.. భక్తులు అడ్డుకోవడంతో పంబ నుంచే వెనుదిరిగిపోయిన ఘటనలున్నాయి. మరి ఆ ఇద్దరికి ఆలయ ప్రవేశం అంతా సులువుగా ఎలా లభించిందనేది ట్విస్ట్.

  ఆ ఇద్దరికి ఎంట్రీ అంత సులువా?

  ఆ ఇద్దరికి ఎంట్రీ అంత సులువా?

  50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోనికి ప్రవేశించడం నిషేధం. దానికి బ్రేక్ వేస్తూ గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో..

  ఎంతోమంది మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అడుగడుగునా అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. అలాంటిది బుధవారం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు 40 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం వివాదస్పదమైంది. అసలు ఆ ఇద్దరిని లోపలికి ఎలా పంపించారు? భక్తులెవరూ అడ్డుకోలేదా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

  అలా వచ్చారా..? అందుకేనా సాఫీగా దర్శనం..!

  అలా వచ్చారా..? అందుకేనా సాఫీగా దర్శనం..!

  బిందు, కనకదుర్గ అనే మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనే అనుమానాలున్నాయి. ట్రాన్స్‌జెండ‌ర్ల మాదిరిగా నటించి అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారనే వాదనలు జోరందుకున్నాయి. వీరికి పోలీసులు కూడా భారీ భద్రత కల్పించారు. భక్తులు ఎవరూ అడ్డుపడకుండా హడావిడిగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో బయటకు వచ్చిన వీడియోల్లో కూడా ఇదే విషయం బోధపడుతుంది.

  అదేనా స్ఫూర్తి.. అందుకేనా ఈవిధంగా..!

  అదేనా స్ఫూర్తి.. అందుకేనా ఈవిధంగా..!

  గతేడాది డిసెంబర్ 16వ తేదీన అయ్యప్ప దర్శనానికి వచ్చిన నలుగురు ట్రాన్స్‌జెండ‌ర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి ట్రాన్స్‌జెండ‌ర్లకు దర్శనభాగ్యం కల్పించారు. బుధవారం నాడు ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు డిసెంబర్ 24వ తేదీన అయ్యప్ప దర్శనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పంబ దగ్గర భక్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అయితే ట్రాన్స్‌జెండ‌ర్లకు దర్శనభాగ్యం కలగడంతో అదే దారి వీరు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆవిధంగా ట్రాన్స్‌జెండ‌ర్ల ముసుగులో అయ్యప్ప సన్నిధిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇది వారి ఐడియానా? లేదంటే దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది మాత్రం తేలలేదు.

  English summary
  Bindu and Kanakadurga are suspected to have entered the Sabarimala temple as per the plan. The arguments about the arrival of the women into the temple as transgender charecters. Police also provided huge security.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X