వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు నిర్మాణం కింద రామమందిరం ఉండేదని చెప్పేందుకు రుజువులు ఉన్నాయని రామ్‌లల్లా తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అక్కడ తవ్వకాల్లో దొరికిన వస్తువులను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకప్పుడు ఇక్కడ ఆలయం ఉండేదనే విషయం అర్థమవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

రక్షణ కల్పించండి: సుప్రీంకోర్టుకు అయోధ్య-మసీదు కేసు ట్రయల్ జడ్జీరక్షణ కల్పించండి: సుప్రీంకోర్టుకు అయోధ్య-మసీదు కేసు ట్రయల్ జడ్జీ

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసును విచారణ చేస్తోంది. రామ్ లల్లా తరపున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలు వినిపిస్తున్నారు. ముస్లిం పార్టీలు చెబుతున్నట్లుగా అక్కడ ఈద్గా కానీ ఇస్లాం నిర్మాణాలు కానీ లేవని వైద్యనాథన్ కోర్టుకు తెలిపారు. తొలిసారి వాదనలు వినిపించినప్పుడు కూలిన బాబ్రీ మసీదు స్థలంలో అంతకుముందు ఎలాంటి నిర్మాణం లేదని ముస్లిం పార్టీలు చెప్పినట్లు వైద్యనాథ్ కోర్టుకు గుర్తు చేశారు. తర్వాత ఇస్లాం నిర్మాణం లేదా ఈద్గా ఉందని చెబుతున్నారని వైద్యనాథన్ చెప్పారు.

There is proof that there existed a temple beneath Babri Masjid:Ramlalla Counsel to SC

కూలిన బాబ్రీ మసీదు కింద ఓ ఆలయం ఉందని అక్కడ చేపట్టిన తవ్వకాల్లో స్తంభాలకు సంబంధించి కొన్ని ఆధారాలు దొరికినట్లు కోర్టుకు తెలిపారు వైద్యనాథన్. ఇప్పటి వరకు కేవలం ఒక సందేహం మాత్రమే ఉండేదని కానీ ఇప్పుడు దొరికిన వస్తువుల ఆధారాలను పరిశీలిస్తే అక్కడ కచ్చితంగా ఆలయం ఉన్నిందని చెప్పేందుకు ఇంతకంటే రుజువులు ఏమికావాలని వైద్యనాథన్ చెప్పారు.

అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు వివాదంను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు రోజువారీ వాదనలు వింటోంది. సుప్రీంకోర్టులో అయోధ్య అంశంపై జరుగుతున్న అన్ని వాదనలను అక్టోబర్ 18కల్లా ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సెప్టెంబర్ 26న చెప్పారు. అయోధ్య భూవివాదంపై వాదనలు వింటున్న సీజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు అయోధ్య భూవివాదం కేసులో అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించి ముగించేందుకు కొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని నొక్కి చెప్పారు జస్టిస్ రంజన్ గొగోయ్. అయితే తాను పదవీవిరమణ చేసే లోగా అయోధ్య పై ఒక తీర్పు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.

English summary
The counsel for deity Ram Lalla on Thursday told the Supreme Court that there is “proof beyond doubt” about the existence of a “massive structure” beneath the demolished Babri Masjid in Ayodhya and inference from excavated materials can be drawn that it was a temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X