వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ప్రజల రక్తంలో హిందీకి అవకాశం లేదు.. డీఎంకే అధినేత స్టాలిన్..

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో హింది బాషను బలవంతంగా ప్రవేశపెడితే తేనేతుట్టేను కదిపినట్టేనని డీఎంకే అధినేత స్టాలిన్ హెచ్చరించారు .తమిళనాడు ప్రజల్లో రక్తంలో హింది అనేది లేదని అయన అన్నారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్‌లో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. కాగా జాతియ విద్యావిధానంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమీటి ఇచ్చిన రిపోర్టలో భాగంగా ఇచ్చిన నివేదికపై ఆయన స్సందించారు.

జాతాయ విద్యా విధానంపై కస్తూరీ రంగన్ ముసాయిదా

జాతాయ విద్యా విధానంపై కస్తూరీ రంగన్ ముసాయిదా

ఇటివల జాతియ విద్యావిధానంలో మార్పులను తీసుకువచ్చేందుకు కేంద్రం కస్తూరి రంగన్ కమిటిని నియమించింది.ఇందులో భాగంగానే కమిటి ప్రస్థుతం ఉన్న విద్యావిధానంపై అధ్యయనం చేసిన కమిటి పలు కొత్త పద్దతులను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే హిందీయోతర రాష్ట్ర్రాల్లో ఫస్ట్ సెకండ్ ,ల్యాగ్వేజ్‌లనే కాకుండా తప్పనిసరిగా హిందీని ఫస్ట్ క్లాస్ నుండి 12th వరకు మూడవ బాషగా తప్పనిసరిగా చేర్చాలని కస్తూరి రంగన్ కమిటీ మే 31న విడుదల చేసిన తన ముసాయిదాలో పేర్కోంది.

తమిళనాడులో హిందిని వ్యతిరేకిస్తున్న డీఎంకే

తమిళనాడులో హిందిని వ్యతిరేకిస్తున్న డీఎంకే

దీంతో కస్తూరీ రంగన్ విడుదల చేసిన ముసాయిదాపై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందించారు. హిందీయోతర రాష్ట్ర్రాల్లో తప్పని సరిగా హిందిని చేర్చడంపై అయన స్పందించారు. ఈనేపథ్యంలోనే తమిళనాడులో దీన్ని అంగీకరించమని చెప్పారు.మరోవైపు తమిళనాడు ప్రజల రక్తంలో హిందీ బాష అనేది లేదని అన్నారు.మరోవైపు ఈ ప్రతిపాదన దేశాన్ని విడదీస్తుందని అన్నారు. ఈనేపథ్యంలోలో ఈ అంశంపై పార్లమెంట్‌లో తమ ఎంపీల చేత బీజేపీ ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు.

పార్లమెంట్‌లో నిలదీస్తాం కనిమెలి

పార్లమెంట్‌లో నిలదీస్తాం కనిమెలి

పార్లమెంట్‌లో పార్టీ నాయకురాలైన కనిమొలి సైతం ఈ అంశంపై స్పందించింది. పార్టీ నిర్ణయించినట్టు పార్లెమెంట్‌లో లేవనెత్తుమని చెప్పింది. దీనిపై పార్లెమెంట్‌ను స్ధంబింప చేస్తామని చెప్పింది, కాగా ఇది బాషలపై యుద్దం అంటు పేర్కోన్నారు, ఇక ఈ అంశంపై ఎలాంటీ పరిమాణలనైనా ఎదుర్కోంటామని మరో రాజ్యసభ ఎంపీ త్రిచి శివ స్పష్టం చేశారు.

ఇది ముసాయిదా మాత్రమే కేంద్ర మంత్రి జవదేకర్

ఇది ముసాయిదా మాత్రమే కేంద్ర మంత్రి జవదేకర్

కాగా జాతీయ విద్యావిధానం పై తీసుకువచ్చిన ముసాయిదా బలవతంగా రాష్ట్ర్రాల పై బలవంతంగా రుద్దేందుకు కాదని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ముసాయిదాపై పలు రాష్ట్ర్రాల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇతర రాష్ట్ర్రాలపై బలవంతంగా బాషను రుద్దాలనే ఉద్దేశ్యం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.ముసాయిదాపై ప్రజల అభిప్రామాన్ని తీసుకుంటామని చెప్పారు.

English summary
Reacting to the HRD ministry's new education policy draft which introduces Hindi as a compulsory subject in the non-Hindi speaking states, Dravida Munnetra Kazhagam (DMK) president MK Stalin on Saturday said that Hindi is not in the blood of the people of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X