వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడిలో నిఘా వైఫల్యమేం లేదు : లోక్‌సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి నిఘా వైఫల్యం లేదని మరోసారి కేంద్రం స్పష్టంచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా జవాన్లు నెలకొరిగారు. అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే దాడి జరిగిందనే విమర్శలు వచ్చాయి. దీనిని ఖండించిన కేంద్రం .. మరోసారి పార్లమెంట్‌లో ప్రకటన చేసింది.

నో ఫెయిల్యూర్ ..
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమీ లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి. ఈ మేరకు ఆయన లోక్‌సభలో ప్రకటన చేశారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలపాలు విస్తరిస్తున్నాయి. అలాగే వారికి మద్దతిచ్చే సంస్థలు కూడా పెరిగాయి. గత 30 ఏళ్లుగా కశ్మీర్‌లో ఉగ్రవాద భూతం పెట్రేగిపోతుంది. ఈ క్రమంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులతో భద్రతాబలగాలు పోరాడుతూనే ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. గత కొన్నిరోజులుగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.

‘There was no intelligence failure in Pulwama attack’: Government in Parliament

కలిసికట్టుగా ...
కశ్మీర్‌లో అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. పోలీసులు, ఇంటెలిజెన్స్, జాతీయ దర్యాప్తు సంస్థ, సీఆర్పీఎఫ్ తదితర విభాగాలు సమన్వయం చేసుకొని .. పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. పుల్వామా దాడి కుట్రను ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ తన ఇన్వెస్టిగేషన్‌లో వివరించిందని పేర్కొన్నారు. వాహనం సమకూర్చిన ఉగ్రవాది, ఆత్మాహుతిగా మారిన మానవబాంబే ప్రధాన సూత్రధారులని తెలిపిన సంగతిని నొక్కి వక్కానించారు. ఫిబ్రవరి 14న జరిగిన దాడిలో 40 మంది జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. దాడి చేసింది తామేనని జైషే మహ్మద్ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఆ సంస్థ శిక్షణ శిబిరాలను బాలాకోట్‌లో వైమానిక దళం దాడిచేసింది. దీంతో ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

English summary
Kishan Reddy, Minister of State in the Ministry of Home Affairs said there was no intelligence failure in the Pulwama attack, on Wednesday in Parliament. On being asked whether the reasons of Pulwama terror attack was a failure of intelligence, Reddy in Lok Sabha replied, “Jammu and Kashmir are affected by terrorism sponsored and supported from across the border for the last three decades. However, owing to the policy of zero tolerance towards terrorism and sustained action against the terrorists by the security forces, a large number of terrorists have been neutralized during the past few years.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X