వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ది గ్రేట్: వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ ఫైర్ కాలేదు...!

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఎంతో ఉత్కంఠను చెలరేపిన అతి సున్నితమైన సంఘటనలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా వారం రోజులు గడిచిపోయింది. దీంతో గడిచిన వారం రోజుల్లో ఓక్క బుల్లెట్ పేలకుండా ప్రశాంతంగా ప్రజలు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

కశ్మీర్‌లో పరిస్థితులు తలక్రిందులు

కశ్మీర్‌లో పరిస్థితులు తలక్రిందులు

కశ్మీర్‌లో 370 ఆర్టికల్ తోలగిస్తే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతాయి..., ముఖ్యంగా కశ్మీర్‌లో జనజీవనం స్థంభించి,ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి.., ఈనేపథ్యంలోనే ఆర్టికల్స్ తొలగింపు సంధర్భంలో విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం కనీసం నెల రోజుల వరకు ఆసాధరణ పరిస్థితులు ఉంటాయని ముందే చెప్పి ఇంటికి పించించారు.దీనికి తోడు వేలాది మంది భద్రతా దళాలు అక్కడ పహార కాచాయి. దీంతో అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అనే అందోళన దేశవ్యాప్తంగా నెలకోంది.

వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ బయటకు రాలేదు.. డీజీపీ

వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ బయటకు రాలేదు.. డీజీపీ

కాని ఆర్టికల్స్ తోలగించడంతో పాటు కశ్మీర్ విభజన జరిగి వారం రోజులు గడిపోయాయి. దేశవ్యాప్తంగా ఏదో ఉహించని పరిణామాలు జరుగుతాయని భావించారు. కాని ఈ వారం రోజుల్లో లక్షలాదిగా భద్రతా దళాల రక్షణలో ఉన్న కశ్మీ‌ర్‌లో ఒక్క బుల్లెట్ కూడ బయటకు రాకుండా ప్రశాంత వాతవరణం కొనసాగుతోంది. ఇక ఇదే విషయాన్ని కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ కూడ ప్రకటించారు. అయితే కశ్మీర్ భద్రతా దిగ్బంధంలోకి వెళ్లిందని, దీంతో నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం శుక్రవారం నుండి కర్ఫ్యూను సడలించి,విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగి నాలుగు రోజుల అనంతరం ప్రారంభించారు

ముందుంది అసలు విషయం అన్న ఇమ్రాన్ ఖాన్

ముందుంది అసలు విషయం అన్న ఇమ్రాన్ ఖాన్

ఇక అర్టికల్స్ రద్దు రత్వాత కశ్మీర్ మొత్తం భద్రతా దళాల చేతుల్లోకి వెళ్లడంతోపాటు ఎలాంటీ అవంచానీయ సంఘటనలు జరగకుండా కర్ఫ్యూ విధించారు. అయితే కర్ఫ్యూ ఉంది కాబట్టే ఎలాంటీ సంఘటనలు చేసుకోవడవడం లేదని కర్ఫ్యూ సడలించిన తర్వాత జరిగిన తర్వాత ప్రజలు తమ ఆందోళనలు కొనసాగిస్తారని, తదనంతర పరిణామాలపైనే ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ప్రకటనలు చేశాడు. అయితే కర్ఫ్యూ తొలగించి రెండు రోజులు కావస్తున్న అనంతరం కూడ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కడ కూడ హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా సాధరణ జనజీవనం కొనసాగుతోంది.

English summary
There was “not a single incident of violence in Jammu and Kashmir till today,”said Jammu and Kashmir police chief Dilbag Singh,“Things are absolutely normal in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X