వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ ప్రతీకారాలు ఉండవు..! యడియూరప్ప సంచలన నిర్ణయం..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్ : కర్ణాటక రాజకీయాలు రసవత్తంరంగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు సాగుతున్నాయి కన్నడ రాజకీయాలు. కర్ణాటక అసెంబ్లీలో సోమవారంనాడు జరిగిన బలపరీక్షలో నెగ్గిన బీజేపీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. బోర్డులు, కార్పొరేషన్‌ల అధికారాలను ఉపసంహరించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ డిపార్ట్‌మెంట్ సెక్రటరీలు ఇన్‌చార్జులుగా పని చేస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ప్రతీకారానికి పాల్పడదని, మనీ బిల్లులో ఏమాత్రం మార్పు లేకుండా సభామోదం పొందేలా చూస్తామని యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇందుకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు చేపడుతున్నట్టు విశ్లేషిస్తున్నారు.

There will be no political reprisals.!Yeddyurappa sensational decision..!!

కర్ణాటక కొన్ని రోజులుగా ఏ ప్రభుత్వం స్థిరంగా లేక సతమతమౌతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తాము ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ సార్వత్రిక ఎన్నికల అనంతరం ముందుకు వచ్చినా తమ బలం నిరూపించుకోలేక వెనుదిరిగింది. కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, జేడీఎస్ ఏర్పడటంతో స్థిరమైన ప్రభుత్వం వచ్చిందనుకున్నారు కర్ణాటక ప్రజలు. అంతుచిక్కకుండా పావులు కదిపిన బీజేపీ తన బలనిరూపణకు కావాల్సిన బలం ఉందని చెప్పకనేచెప్పింది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం లో జేడీఎస్, కాంగ్రెస్ మధ్య శాసనసభ్యుల మధ్య వచ్చిన విభేదాలు బీజేపీకి కలిసొచ్చాయి. కూటమి ప్రభుత్వం కూలిపోయింది. కుమారస్వామి రాజీనామా చేశాడు. అయితే ఇంత జరిగినా కూటమి చివరి వరకూ పోరాడింది. ఐతే కర్ణాటక రాజకీయాల్లో చురుగ్గా పావులు కదిపిన యడియూరప్ప ప్రతికార రాజకీయాలకు పాల్పడబోమని, ప్రజారంజక, సుస్థిర పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు.

English summary
BJP Chief Minister BS Yeddyurappa, who was in power at the Karnataka Assembly on Monday, decided to move. The powers of boards and corporations have been revoked. Notification has been issued to this extent. The order stated that the department secretaries will act as incharges until further orders are issued. Yeddyurappa has already announced that his government will not resort to any kind of political retaliation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X