వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీపై పోరాడానికి 52 మంది ఎంపీలు చాలు : రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్నికల ఓటమి తర్వాత అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ .. ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. తమ ఒక్కో ఎంపీ .. బీజేపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశారు.

These 52 MPs will fight BJP for every inch: Rahul

52 సభ్యులు చాలు ..
లోక్ సభలో తమ 52 మంది ఎంపీలు పార్టీకి కొండంత బలం అని చెప్పారు. వీరంతా కలిసి బీజేపీ 303 మంది ఎంపీలను సమర్థంగా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం స్వాతంత్ర పూర్వపు పరిస్థితి ఉందని .. మనమంతా కలిసి సమిష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమయంలో మనకు ఎవరి నుంచి మద్దతు లభిస్తుందని ఆశించొద్దని స్పష్టంచేశారు. అంతేకాదు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగబద్ద సంస్థలన్నీ ఎన్డీఏ ఆడించే కీలుబొమ్మలని విమర్శించారు. మనమే పోరాడాలి .. మనమే గెలవాలి అని ఎంపీల్లో ధైర్యం నూరిపోశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడారని .. ఒక్కొక్కరిని రాహుల్ అభినందించారు.

రాజీనామాపై రాజీ ..
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ పార్టీ నేతలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పోన్ స్విచాప్ చేసుకొని అందుబాటులో లేకపోవడంతో నేతలంతా ఆందోదళన చెందారు. సోనియా కలుగజేసుకొని .. పార్టీ చీఫ్ కొత్త వ్యక్తిని ఎన్నికయ్యే వరకు కొనసాగాలని చెప్పడంతో .. మరో 4 నెలలు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని రాహుల్ చెప్పడంతో .. ఈ గొడవ సద్దుమణిగింది.

English summary
Back from a hiatus after Congress’s dismal performance in the Lok Sabha polls, Rahul Gandhi rallied his party's newly-elected 52 Members of Parliament (MPs) at the Congress Parliamentary Party (CPP) meet on Saturday. In his first take down of the re-elected National Democratic Alliance (NDA) government, Rahul said that Congress faces a pre-Independence-like situation where it cannot expect any kind of support from the country’s institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X