వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ప్రాంతంలో కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలిపే యాప్స్ ఇవే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ రోజుల్లో మానవుడి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. పెరిగిపోతున్న కాలుష్యం ఇందుకు కారణం. ఎంతో కాలం బతకాల్సిన మనిషి తాను సగటున బతికే జీవితకాలంలో ఏడేళ్ల ముందే మరణిస్తాడని పలు పరిశోధనలు తేటతెల్లం చేశాయి. ఇందుకు కారణం గాల్లో కాలుష్యమే. ఇది మానవుడు తన చేజేతులా చేసుకున్న తప్పిదం. ఇప్పటికే ఢిల్లీలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. గాల్లో కాలుష్యంతో ఏకంగా ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే వరకు పరిస్థితి వెళ్లింది. ఢిల్లీలో కాలుష్యం పై అక్కడున్నవారు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఢిల్లీవాసులకు కాలుష్యం కష్టాలు తగ్గలేదు. కాలుష్యం ఎప్పుడూ లేనంతగా తీవ్ర స్థాయిలో ఢిల్లీని కప్పేసింది. కాలుష్యం అక్కడ పెరిగేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇక మీ ప్రాంతంలో ఎంత కాలుష్యం ఉందో తెలుసుకునేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని యాప్స్ ఉన్నాయి.

 ఎయిర్ క్వాలిటీ లేదా ఎయిర్ విజువల్ యాప్‌

ఎయిర్ క్వాలిటీ లేదా ఎయిర్ విజువల్ యాప్‌

కాలుష్యం మీ ప్రాంతంలో ఎంతుందో తెలుసుకునేందుకు ఎయిర్ క్వాలిటీ లేదా ఎయిర్ విజువల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్ మీ ప్రాంతంలోని సమాచారంతో పాటు కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుంది అనేది అంచనా వేస్తుంది. అంతేకాదు ఈ యాప్ వాతావరణంను కూడా ముందే పసిగట్టి చెబుతుంది. అంటే ఉష్ణోగ్రత వివరాలు, గాలిలో తేమ శాతం లాంటి సమాచారం చేరవేస్తుంది. అంతేకాదు గాల్లో కాలుష్యం పెరిగేందుకు కారకాలు ఏమై ఉంటాయో కూడా చెబుతుంది. గాల్లో కాలుష్యంతో ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు కూడా చెబుతుంది.

 ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ బ్రీజో మీటర్:

ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ బ్రీజో మీటర్:

మీ వీధిలో, లేదా బ్లాక్ లేదా దేశంలో నెలకొన్న కాలుష్యంను రియల్‌టైమ్‌లో చెబుతుంది. గాలిలోని క్వాలిటీకి సంబంధించిన సమాచారం చేరవేస్తుంది. ఇతర ప్రాంతాల్లో కాలుష్యం వివరాలు కూడా సేకరించి పంపుతుంది. ఫలానా ప్రాంతంలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో వినియోగదారుడు ఇట్టే ఈ యాప్‌ ద్వారా కనుక్కోవచ్చు. అంతేకాదు ఫైర్ అలర్ట్‌తో పాటు రోజువారీ వాతావరణ విశేషాలు కూడా చెబుతుంది.

ప్లూమ్ ల్యాబ్స్ నుంచి తయారైన ఎయిర్ క్వాలిటీ యాప్:

ప్లూమ్ ల్యాబ్స్ నుంచి తయారైన ఎయిర్ క్వాలిటీ యాప్:

ఎయిర్ క్వాలిటీ బై ప్లూమ్ ల్యాబ్స్ యాప్ కూడా గాలిలో కాలుష్యం వివరాలను తెలియజేస్తుంది. మీరు ఉంటున్న నగరంలో కాలుష్యం ఏ మేరకు ఉందనేది ఈ యాప్ చెబుతుంది. గాలిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటే ఓ యానిమేషన్ కూడా హెచ్చరిస్తుంది. గంట గంటకు గాల్లో కాలుష్యం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది కూడా ఈ యాప్ సమాచారం ఇస్తుంది. ఇక పొల్యూషన్ లెవల్స్‌ను బట్టి బయటకు వెళ్లాలా లేదా అనేది కూడా చెప్పడం ఎయిర్ క్వాలిటీ బై ఫ్లూమ్ యాప్ ప్రత్యేకత

 ఎయిర్ క్వాలిటీ : రియల్ టైమ్ ఏక్యూఐ

ఎయిర్ క్వాలిటీ : రియల్ టైమ్ ఏక్యూఐ

ఎయిర్ క్వాలిటీ, రియల్ టైమ్ ఏక్యూఐ అనే ఈ యాప్ ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ సమాచారంను అందిస్తుంది. అంటే పీఎం 2.5 పీఎం 10కి సంబంధించి ప్రతి గంటకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ యాప్‌లో ఒక విడ్జెట్ కూడా ఉంటుంది. అది ఫోన్ హోం స్క్రీన్‌పై వస్తుంది. ఇక చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్, వియత్నాంలతో పాటు 60దేశాల్లోని కాలుష్య వివరాలు ఈ యాప్ తెలుపుతుంది.

English summary
Air pollution levels are on an all time high and while we don’t need indicators to prove this you can still check out these apps to stay updated with detailed information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X