• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గూగుల్ సెర్చ్2015లిస్ట్: సన్నీలియోన్ టాప్, మోడీ10

|

న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2015 సంవత్సవరంలో గూగుల్‌లో ఎక్కువగా శోధించిన అంశాలను ఆ సంస్థ గురువారం ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రముఖ మాజీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ లామర్‌ ఒడోమ్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధించారట. భారతదేశంలో కూడా ఎక్కువగా వెదికిన అంశాలను గూగుల్ ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే.. లామర్‌ ఒడోమ్‌ జాతీయ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌లో లాస్‌ఏంజెల్స్‌ లాకర్స్‌ సభ్యుడిగా గుర్తింపు పొందారు. వైవాహిక జీవితం వివాదాస్పదం కావడం, అధికమోతాదులో మందులు తీసుకుని ఆస్పత్రి పాలు కావడం లాంటి తదితర కారణాల వల్ల లామర్‌ ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు. లామర్‌ తర్వాత ఫ్రాన్స్‌లోని చార్లీ హెబ్డో పత్రిక గురించి వెతికారు.

2015లో గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా శోధించిన అంశాలు:

1. లామర్‌ ఒడోమ్‌

2. చార్లీ హెబ్డో పత్రిక

3. మొబైల్‌ గేమ్‌ - అగర్‌.ఐవో

4. జురాసిక్‌ వరల్డ్‌ సినిమా

5. పారిస్‌

6. ఫ్యూరియస్‌ 7 సినిమా

7. వీడియోగేమ్‌ ఫాల్‌ అవుట్‌ 4

8. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ రోండా రౌసీ

9 ఒలింపిక్‌ ఛాంపియన్‌ బ్రూస్‌ జెన్నర్‌

10. అమెరికన్‌ స్నైపర్‌ సినిమా

These are the top Google searches from 2015

ఇక భారతదేశానికి సంబంధించిన అంశాలు: టాప్ 10

ప్రముఖ టాప్-10 వ్యక్తులు:

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ అగ్రస్థానం దక్కించుకోగా.. తర్వాతి స్థానాల్లో సల్మాన్‌ఖాన్, ఏపీజే అబ్దుల్ కలాం, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారుఖ్‌ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, ఆలియాభట్, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వెదకబడిన సినిమాల విషయానికొస్తే: టాప్-10

జురాసిక్ వరల్డ్, ఫ్యూరియస్ 7, అమెరికన్ స్నిపర్, ఫిఫ్త్ షేడ్ ఆఫ్ గ్రే, మినియన్స్, స్పెక్టర్, స్ట్రెయిట్ అట్టా కాంప్టన్, మ్యాడ్ మ్యాక్స్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, బర్డ్‌మ్యాన్

భారత్‌లో టాప్-10:

బాహుబలి, భజ్‌రంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏబీసీడీ 2, ఐ, పీకే, పులి, రాయ్, హమారీ అధూరీ కహానీ, శ్రీమంతుడు.

ప్రపంచ వ్యాప్తంగా వెదకబడిన టెక్ ఉత్పత్తులు:

ఐఫోన్ 6ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్6, యాపిల్ వాచ్, ఐప్యాడ్ ప్రో, ఎల్‌జీ జీ4, శాంసంగ్ గెలాక్సీ నోట్ 5, శాంసంగ్ గెలాక్సీ జె5, హెచ్‌టీసీ వన్ ఎం9, నెక్సస్ 6పి, సర్ఫేస్ ప్రో 4

These are the top Google searches from 2015

భారత్‌లో టాప్-10:

యు యురేకా, యాపిల్ ఐఫోన్ 6ఎస్, లెనోవో కె3 నోట్, లెనోవో ఎ7000, మోటో జి, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్ 5, శాంసంగ్ గెలాక్సీ జె7, మోటో ఎక్స్ ప్లే, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్, లెనోవో ఎ6000.

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన బాలీవుడ్ హీరోలు:

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, అమీర్‌ఖాన్, వరుణ్ ధావన్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్.

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన బాలీవుడ్ హీరోయిన్లు:

సన్నీ లియోన్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, ఆలియాభట్, రాధికా ఆప్టే, అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, పూనమ్ పాండే.

దేశవ్యాప్తంగా గూగుల్‌లో వెదకబడిన క్రీడాకారులు:

విరాట్ కోహ్లీ, లియోనల్ మెస్సీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెదరర్, సానియా మీర్జా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, నోవాక్ జకోవిచ్.

ఎక్కువగా వెదకబడిన వెబ్‌సైట్లు:

ఫ్లిప్ కార్ట్, ఐఆర్‌సిటిసి, ఎస్‌బిఐ, అమెజాన్, స్నాప్‌డీల్, ఇండియన్ రైల్వేస్, హెడ్‌డిఎఫ్‌సి, క్రిక్‌బజ్, వాట్సప్, పేటీఎం.

గూగుల్ ట్రెండింగ్ సెర్చ్‌లు:

ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2015, బాహుబలి, బజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఐపిఎల్, అబ్దుల్ కలాం, ఎస్ఎస్‌సి పరీక్షలు, బిగ్ బాస్ 9, స్టార్ స్పోర్ట్స్.

English summary
Each year Google summarizes its year in search, which looks at what people around the world were searching for over the last twelve months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X