• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆపదలో అడ్డురాని మతం .. పరస్పర కిడ్నీ మార్పిడికి సహకారం

|

చండీగఢ్ : మతం మనిషికే కానీ మనసుకు కాదని నిరూపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబ పెద్దకు ప్రాణ భిక్ష పెట్టారు. కొన్నాళ్లకు దాత భార్యకు ఆపన్నహస్తం అందించారు. మేమున్నామంటు భరోసా కల్పించారు. కశ్మీర్ ముస్లింకు బీహార్ వాసి కిడ్నీ అందించగా ... తర్వాత అతని భార్య బీహర్ వాసి భార్యకు కిడ్నీ దానం చేసి తమ మధ్య మతాలు లేవు .. మానవత్వం ఉందని చాటారు.

కార్పొంటర్‌గా విధులు ..

కార్పొంటర్‌గా విధులు ..

కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా కరేరికి చెందిన అబ్దుల్ అజీజ్ కార్పెంటర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. అతనిది పేద కుటుంబం. ఫ్యామిలీ కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేశాడు. తొలుత కిడ్నీలో రాళ్లు వచ్చాయి. వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఉన్న రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. తమ ఇంటి పెద్దకు ఆపద రావడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. తనకు సరిపోయే కిడ్నీ కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

మంజులకు కూడా ...

మంజులకు కూడా ...

బీహర్‌కు చెందిన సుజిత్ కుమార్ సింగ్ భార్య మంజుల కూడా కిడ్నీ దెబ్బతింది. దీంతో అతను కూడా యాప్‌లో కిడ్నీ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. విచిత్రంగా సుజిత్ కిడ్నీ అబ్దుల్ నజీజ్‌తో సరిపోలగా ... అతని భార్య మంజులం కిడ్నీ అబ్దుల్ భార్య షాజియాతో మ్యాచ్ అయ్యింది. దీంతో ఇరువురు కిడ్నీ మార్పిడికి పరస్పర అంగీకారం తెలిపారు. వారికి ప్రాథమిక చికిత్స చేసి కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. పంజాబ్‌లోని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు నాలుగు సర్జరీలు చేసి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఇక్కడ ఇద్దరూ వేరే మతానికి చెందిన వారు కాగా .. ఇద్దరీ రాష్ట్రం కూడా వేరు. ఒకరిది బీహర్, మరొకరిది కశ్మీర్ కాగా ... శస్త్రచికిత్స చేసింది మాత్రం పంజాబ్‌లో జరగడం విశేషం.

ఇబ్బందులు తప్పలేదు ..

ఇబ్బందులు తప్పలేదు ..

శస్త్రచికిత్స చేసే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నామని వైద్యులు తెలిపారు. భిన్న వ్యక్తులకు సర్జరీ చేయడం, రెండోది ఇద్దరిది వేరే రాష్ట్రాలు కావడం, మూడోది మతం కూడా విభిన్నమవడమని వైద్యులు తెలిపారు. కానీ వీటన్నింటి ముందు మానవత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు. వీరికి నాలుగు శస్త్రచికిత్సలను గతేడాది డిసెంబర్ 3న చేశామని వైద్యుడు డాక్టర్ రంజన్ పేర్కొన్నారు.

కళ్లు చెమర్చాయి ...

కళ్లు చెమర్చాయి ...

తాము ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించారని కిడ్నీ గ్రహిత అబ్దుల్ నజర్ పేర్కొన్నారు. ఇందులో మతానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఓ హిందువుకు చెందిన కిడ్నీ తనకు అమర్చడం పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పారు. కానీ తనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాయం చేయలేదన్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం రూ.7 లక్షలు తన సొంత డబ్బులు ఖర్చుపెట్టానని వివరించారు. ఇటు సర్జరీపై సుజిత్ కుమార్, అతని భార్య మంజుల కూడా సంతోషం వ్యక్తం చేశారు. సరైన సమయంలో కిడ్నీ లభించలేదని .. ఓ ముస్లిం మహిళ కిడ్నీ తన భార్యను బ్రతికించిందని సగర్వంగా తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
breaking religious barriers, a Hindu man donated his kidney to a Kashmiri Muslim, whose wife later donated her kidney to the Hindu donor’s wife. Abdul Aziz Nazar, a carpenter by profession and aged 53, hails from Kareri village of Baramulla district. Belonging to a poor family, Abdul had lost both the kidneys due to urolithiasis (kidney stones) and was searching for a donor. Nazar had registered his name on an app that matched donors and receivers. Similarly, Sujit Kumar Singh,46, from Bihar was also searching for a kidney for his wife Manjula, 42, who was a patient of glomerulonephritis (a kidney disease) and had both her kidneys affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more