వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17వ లోక్‌సభలో ప్రముఖుల ముఖాలు కనిపించవు.. ఉద్దండుల గొంతుక వినిపించదు

|
Google Oneindia TeluguNews

మూడు దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో వారి పార్టీ తరపున నినదించిన గొంతు వారిది. లోక్‌సభలో తమ నియోజకవర్గం సమస్యలు తమ ప్రజల సమస్యలు లేవనెత్తిన వారు. అయితే ఈ 17వ లోక్‌సభలో మాత్రం వారి గొంతు వినిపించదు... వారిని చూద్దామన్న కనిపించరు.

 పోటీ చేయని అద్వానీ, మనోహర్ జోషి

పోటీ చేయని అద్వానీ, మనోహర్ జోషి

ముగిసిన లోక్‌సభలో అత్యంత సీనియర్ ఎంపీగా ఎల్‌కే అద్వానీ పనిచేశారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. 1991 నుంచి ఆయన గాంధీనగర్‌లో విజయం సాధిస్తూ వచ్చారు. ఒకవేళ అద్వానీ 17వలోక్‌సభలో పోటీ చేసి గెలుపొంది ఉంటే మరో రికార్డు ఆయన సొంతం అయ్యేది. అద్వానీ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది ఆయన 1990లో నిర్వహించిన రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలు.ఆ తర్వాతే అద్వానీ డిప్యూటీ ప్రధాని కేంద్ర హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 17వ లోక్‌సభలో కనిపించని మరో వ్యక్తి మురళీ మనోహర్ జోషి. 2014లో కాన్పూర్ నుంచి పోటీ చేసిన గెలిచిన జోషి... 1991 నుంచి 1993 వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు వారణాసి నుంచి కూడా పోటీ చేశారు మురళీ మనోహర్ జోషి. వారణాసిలో మోడీని పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించడంతో మనోహర్ జోషిని కాన్పూర్ నుంచి పోటీకి నిలిపింది.

సుదీర్ఘ మహిళా ఎంపీగా సేవలందించిన సుమిత్ర మహాజన్

సుదీర్ఘ మహిళా ఎంపీగా సేవలందించిన సుమిత్ర మహాజన్

బీజేపీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అద్వానీ, జోషిలే టాప్ నాయకుల్లో నిలిచారు.వారే పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీని నిలబెట్టారు.సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభలో స్పీకర్‌గా వ్యవహరించారు. కానీ 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.2014లో లోక్‌సభకు ఎన్నిక కావడం ద్వారా మొత్తం 8 సార్లు ఆమె పార్లమెంటులో అడుగుపెట్టినట్లయ్యింది.1989 నుంచి ఆమె ఇండోర్‌లో విజయం సాధిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు సుదీర్ఘంగా పనిచేసిన ఒకే ఒక్క మహిళా పార్లమెంటేరియన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఇక కేంద్రమంత్రిగా ఆమె పెట్రోలియం శాఖ, మానవవనరుల శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ పదవులు నిర్వర్తించారు.

మోడీ వేవ్‌లో కొట్టుకుపోయిన మహామహులు

మోడీ వేవ్‌లో కొట్టుకుపోయిన మహామహులు

17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని అందించారు. మోడీ మానియాలో కొందరు మహామహుల అడ్రస్సులే గల్లంతు కాగా మరికొందరు బీజేపీ నేతలు కూడా ఓటమిపాలయ్యారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు రాజకీయాల్లోనే కనుమరుగుకానున్నారు. ఇందులో బీజేపీ వృద్ధనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, హుకుమ్ దేవ్ నారాయణ యాదవ్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియాలు ఉన్నారు. ఇక వయసు దృష్ట్యా బీజేపీ వృద్ధ నేతలకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అయితే మోడీని బలంగా విమర్శించిన వారిలో దేవెగౌడ, ఖర్గే, సిందియాలు ఈ సారి పోటీ చేసినప్పటికీ ఘోర పరాభవం మూటగట్టుకున్నారు.

పోటీ చేయని అద్వానీ, మనోహర్ జోషి

పోటీ చేయని అద్వానీ, మనోహర్ జోషి

ముగిసిన లోక్‌సభలో అత్యంత సీనియర్ ఎంపీగా ఎల్‌కే అద్వానీ పనిచేశారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. 1991 నుంచి ఆయన గాంధీనగర్‌లో విజయం సాధిస్తూ వచ్చారు. ఒకవేళ అద్వానీ 17వలోక్‌సభలో పోటీ చేసి గెలుపొంది ఉంటే మరో రికార్డు ఆయన సొంతం అయ్యేది. అద్వానీ పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది ఆయన 1990లో నిర్వహించిన రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలు.ఆ తర్వాతే అద్వానీ డిప్యూటీ ప్రధాని కేంద్ర హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 17వ లోక్‌సభలో కనిపించని మరో వ్యక్తి మురళీ మనోహర్ జోషి. 2014లో కాన్పూర్ నుంచి పోటీ చేసిన గెలిచిన జోషి... 1991 నుంచి 1993 వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు వారణాసి నుంచి కూడా పోటీ చేశారు మురళీ మనోహర్ జోషి. వారణాసిలో మోడీని పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావించడంతో మనోహర్ జోషిని కాన్పూర్ నుంచి పోటీకి నిలిపింది.

 సుదీర్ఘ మహిళా ఎంపీగా సేవలందించిన సుమిత్ర మహాజన్

సుదీర్ఘ మహిళా ఎంపీగా సేవలందించిన సుమిత్ర మహాజన్

బీజేపీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అద్వానీ, జోషిలే టాప్ నాయకుల్లో నిలిచారు.వారే పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీని నిలబెట్టారు.సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభలో స్పీకర్‌గా వ్యవహరించారు. కానీ 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.2014లో లోక్‌సభకు ఎన్నిక కావడం ద్వారా మొత్తం 8 సార్లు ఆమె పార్లమెంటులో అడుగుపెట్టినట్లయ్యింది.1989 నుంచి ఆమె ఇండోర్‌లో విజయం సాధిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు సుదీర్ఘంగా పనిచేసిన ఒకే ఒక్క మహిళా పార్లమెంటేరియన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఇక కేంద్రమంత్రిగా ఆమె పెట్రోలియం శాఖ, మానవవనరుల శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ పదవులు నిర్వర్తించారు.

దేవెగౌడకు షాక్...ఖర్గే ఓటమి

దేవెగౌడకు షాక్...ఖర్గే ఓటమి

ఇక గత మూడు దశాబ్దాలుగా విజయం సాధిస్తూ లోక్‌సభలో తన గళం వినిపిస్తున్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఈ సారి మోడీ మ్యాజిక్ ముందు ఓటమి పాలయ్యారు. తూముకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ ఈ సారి బీజేపీ నేత బసవరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక కర్నాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గే కేంద్రంలో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వర్తించారు. 16వలోక్‌సభలో ఆయన కాంగ్రెస్ తరుపున ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇక గుల్బార్గా నుంచి పోటీ చేసిన మల్లిఖార్జున ఖర్గే బీజేపీ నేత ఉమేష్ జి. జాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

తొలిసారి ఓటమి చూసిన జ్యోతిరాదిత్య సింధియా

తొలిసారి ఓటమి చూసిన జ్యోతిరాదిత్య సింధియా

ఇక రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర వ్యక్తి అయిన జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈసారి ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఆయనకు ఇది తొలి పరాజయం. గుణ నియోజకవర్గం సిందియా కుటుంబానికి కంచుకోటలాంటిది. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కొత్త తరం రాజకీయాలు కావాలని ప్రజలు కోరుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే 542 స్థానాల్లో 300 స్థానాల్లో తొలిసారిగి గెలిచిన వారు కావడం విశేషం.

English summary
In last three decades of India's electoral history they were the strong voices of their party, states and respective constituencies in Lok Sabha but their voices will not be heard in the 17th Lok Sabha, which ga ve a decisive mandate to Narendra Modi government. Prominent among them, who influenced the national politics for decades, are Bharatiya Janata Party (BJP) veterans L.K. Advani, Murli Manohar Joshi, Sumitra Mahajan, Hukumdev Narayan Yadav, former Prime Minister H.D. Deve Gowda,former Congress leader in Lok Sabha Mallikarjun Kharge and his deputy Jyotiraditya Scindia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X