వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలెక్టరేట్ క్లర్ల్ బెడ్ కింద రూ. 60 లక్షల ఆస్తి

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్: అతను ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రూ. లక్షల విలువైన ఆస్తులు సంపాధించాడు. కలెక్టరేట్ లో క్లర్క్ గా పని చేస్తున్న అతని ఆస్తులు చూసి అధికారులు సైతం షాక్ కు గురైనారు.

మధ్యప్రదేశ్ లోని నీమూచ్ అనే ప్రాంతంలోని కలెక్టరేట్ లో నరేంద్ర గాంగ్వల్ అనే వ్యక్తి క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను అక్రమంగా ఆస్తులు సంపాధించాడని లోకాయుక్త అధికారులకు సమాచారం వెళ్లింది.

నరేంద్ర మీద లోకాయుక్త అధికారులు నిఘా వేశారు. ఎట్టకేలకు నరేంద్ర ఇంటిపై దాడులు చేశారు. నరేంద్ర నిద్రపోయే పరుపుకింద చూసిన అధికారులు షాక్ కు గురైనారు. పరుపు కింద 7 లక్షల రూపాయల నగదు గుర్తించారు.

They also found 20 imported watches, five iPhones under bed in Madhya Pradesh

అదే పరుపు కింద ఐదు ఐ ఫోన్లు, 20 ఖరీదైన విదేశీ చేతి గడియారాలు లభించాయి. ఇంటిలోనే రూ. 10 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూ. 60 లక్షల విలువైన ఆస్తుల ధ్రువపత్రాలు, 7 లక్షల రుపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు అన్నారు.

ఇంటిలోనే రూ. 10 లక్షల విలువైన బంగారు నగలు, రెండు కేజీల వెండి వస్తువులు గుర్తించారు. అతని బ్యాంకు లాకర్లు పరిశీలించి 250 గ్రాముల బంగారు నగలు, రెండు కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

క్రిస్ మస్ పండుగ సందర్బంగా సెలవుల్లో గోవా వెళ్లి ఎంజాయ్ చెయ్యడానికి నరేంద్ర ప్లాన్ వేసుకుని అన్ని సిద్దం చేసుకున్నాడని, అదే సమయంలో తాము దాడులు చేశామని, ఇతని అక్రమ ఆస్తుల లెక్కిస్తున్నామని లోకాయుక్త అధికారులు తెలిపారు.

English summary
Assets worth over Rs. 60 lakh and cash worth Rs. 7 lakh, hidden under the bed,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X