వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులను విడదీసే కుట్ర .. ఐక్య పోరాటం అవసరం అంటున్న రైతు సంఘాల నేతలు

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలన్న డిమాండ్ తో నవంబర్లో రైతులు ప్రారంభించిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతులు ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వంతో ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక ఆ తరువాత కిసాన్ పరేడ్ నేపథ్యంలో ఢిల్లీలో కొనసాగిన హింస రైతు సంఘాలలో చీలికలు తెచ్చింది. అయినప్పటికీ రైతుల ఉద్యమం నేటికీ కొనసాగుతూనే ఉంది.

Recommended Video

Agriculture Laws : Congress Party Rasta Rokho Against Farmer Laws ​| Oneindia Telug

 ఆకలిపై వ్యాపారం అనుమతించం .. ఎంఎస్పీపై చట్టం చెయ్యండి : పీఎం మోడీ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్ ఆకలిపై వ్యాపారం అనుమతించం .. ఎంఎస్పీపై చట్టం చెయ్యండి : పీఎం మోడీ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్

రైతులను ప్రాంతాల వారీగా, సమూహాల వారిగా, కులాల వారిగా విభజించే కుట్ర

రైతులను ప్రాంతాల వారీగా, సమూహాల వారిగా, కులాల వారిగా విభజించే కుట్ర

కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

రైతులను ప్రాంతాల వారీగా, సమూహాల వారిగా, కులాల వారిగా విడదీయటానికి ప్రయత్నిస్తున్నారని అయినప్పటికీ రైతులు విడిపోకుండా ఐక్యంగా ఉండాలని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు.

సిక్కు సమాజాన్ని ప్రశంసిస్తూ, కొంతమంది ప్రజలు నిరసనల నుండి బయటకు రావాలని అనుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు.

 ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల ఆంతర్యం చెప్పిన రాకేశ్ టికాయత్

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల ఆంతర్యం చెప్పిన రాకేశ్ టికాయత్


కొంతమంది సిక్కు ప్రజల మనస్సులలో తప్పుడు విషయాలను నూరిపోస్తున్నారు అని, ఈ దేశం సిక్కులకు గర్వకారణం. వారు ఈ దేశం కోసం ఎంతో చేశారని, మేము వారిని ఎంతగా ప్రశంసించినా సరిపోదు, అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడం ఉద్యమం నుంచి విరమింపచేయడానికేనంటూ రాకేష్ టికాయత్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఉద్యమాన్ని మొదట పంజాబ్ ఇష్యూగా, తరువాత సిక్కులుగా తరువాత జాట్స్ కు కు సంబంధించిన సమస్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు . దేశంలోని రైతులు ఐక్యంగా ఉన్నారు. చిన్న రైతు లేదా పెద్ద రైతు అన్న తేడా ఏమీ లేదు. ఈ ఉద్యమం రైతులందరికీ చెందినది,అని రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు.

ఐక్యంగా ఉండండి అంటూ రైతు సంఘం నేతల సూచన

ఐక్యంగా ఉండండి అంటూ రైతు సంఘం నేతల సూచన

ఇది రైతు ఉద్యమం మాత్రమే కాదు, ప్రజా ఉద్యమం అని పేర్కొన్న టికాయత్ ఇది ఎప్పటికీ విఫలం కాదని ప్రభుత్వాలు ప్రజల మాట వినాల్సిందే అని టికాయత్ పునరుద్ఘాటించారు. ఇక నిన్నటికి నిన్న హర్యానాలో కిసాన్ మహా పంచాయత్ లో పాల్గొన్న రాకేష్ టికాయత్ ట్రాక్టర్ క్రాంతి 20 21 ఉద్యమం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీకి 20 వేల ట్రాక్టర్ల దాకా వచ్చాయి అని దీనిని 40 లక్షలకు పెంచటం తమ టార్గెట్ అని రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. అంతేకాదు పండించే పంటలను బట్టి కూడా చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్న టికాయత్ రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

English summary
Farmers 'union leaders are of the view that the central government is trying to weaken the farmers protest.Rakesh Tikayat, general secretary of the Indian Kisan Union, called on the farmers to remain united despite the fact that central govt is trying to divide the farmers into regions, groups and castes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X