వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతను నిర్దోషి... కేవలం ఆ కారణంతోనే బాధితురాలి ఫిర్యాదు... 20 ఏళ్ల రేప్ కేసులో సుప్రీం కీలక తీర్పు...

|
Google Oneindia TeluguNews

1999లో నమోదైన ఓ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు సోమవారం(సెప్టెంబర్ 29) కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఒకప్పుడు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని... ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం కూడా చేశారని పేర్కొంది. కేవలం అతను ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడన్న కారణంతోనే సదరు మహిళ అతనిపై అత్యాచార కేసు నమోదు చేసిందని తెలిపింది. అంతకుముందు,ఇదే కేసులో జార్ఖండ్ హైకోర్టు నిందితుడిని దోషిగా తేల్చగా... సుప్రీం మాత్రం అతన్ని నిర్దోషిగా తేల్చడం గమనార్హం.ఆర్‌ఎఫ్ నారిమణ్,నవీన్ సిన్హా,ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై తీర్పును వెలువరించింది.

16 ఏళ్ల వయసులో అత్యాచారం జరిగిందని...

16 ఏళ్ల వయసులో అత్యాచారం జరిగిందని...

1999లో ఈ కేసు నమోదయ్యే నాటికి ఆ యువతి వయసు 25 సంవత్సరాలు అని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ సదరు యువతి మాత్రం అప్పటికీ తనకు 16 ఏళ్లు మాత్రమేనని పేర్కొన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 13 ఏళ్లేనని మాట మార్చినట్లు పేర్కొంది.ఓరోజు స్కూల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో అతను తనను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి తన పిటిషన్‌లో పేర్కొందని... కానీ ఆ స్కూల్ పేరు మాత్రం ప్రస్తావించలేదని కోర్టు పేర్కొంది.

మతాలు వేరు కావడంతో...

మతాలు వేరు కావడంతో...

అంతేకాదు,అతను తనను పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో 4 ఏళ్ల పాటు అత్యాచార విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదని ఆ యువతి పేర్కొన్నట్లుగా తెలిపింది. నిజానికి వాళ్లిద్దరూ కొన్నేళ్ల పాటు భార్యాభర్తల లాగే సహజీవనం చేశారని... అతను మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమవడంతో కోర్టుకెక్కినట్లు తెలిపింది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆ యువకుడు కూడా సుముఖంగానే ఉన్నాడని... కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు అడ్డుపడుతారని ఆమే అతనితో చెప్పినట్లు వెల్లడించింది. అతను ఎస్టీ కాగా ఆమె క్రిస్టియన్ అని తెలిపింది.

మోసగించలేదన్న కోర్టు...

మోసగించలేదన్న కోర్టు...


ఆ ఇద్దరూ ప్రేమించుకున్న కాలంలో వాళ్లు రాసుకున్న ప్రేమ లేఖలను కూడా పరిశీలించినట్లు కోర్టు వెల్లడించింది. అందులో ఆ యువకుడి మాటలను బట్టి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతను ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు తెలిపింది. కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతోనే పెళ్లి విషయంలో ముందుకెళ్లలేదని పేర్కొంది. ఒకవేళ అతను ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే ఈ కేసే ఉండేది కాదని పేర్కొంది. సాక్ష్యాధారాలను పరిశీలించాక... ఎక్కడా అతను ఆమెను మోసగించే ప్రయత్నం చేసినట్లు కనిపించలేదని వెల్లడించింది.

వేరే పెళ్లి చేసుకుంటున్నాడన్న కారణంతోనే...

వేరే పెళ్లి చేసుకుంటున్నాడన్న కారణంతోనే...

ప్రియురాలితో పెళ్లికి మతం అడ్డురావడంతో అతను వేరే పెళ్లికి సిద్దమయ్యాడని... ఆ పెళ్లికి కేవలం వారం రోజుల ముందు ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని న్యాయస్థానం వెల్లడించింది. కేవలం వేరే యువతితో పెళ్లికి సిద్దపడ్డ కారణంగానే ఆమె కేసు పెట్టిందని... అంతే తప్ప ఆమె పట్ల అతను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని చెప్పింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే సహజీవనం కొనసాగించారని స్పష్టం చేసింది.

English summary
The Supreme Court has acquitted a man in a 20-year-old rape case observing that he and the alleged victim were in love, their relationship was consensual and the case was "an afterthought" - filed when the man was about to marry another woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X