వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహిరంగ లేఖతో వణుకు పుట్టించిన దొంగ.. భయంతో బిక్కచచ్చిన కాలనీ వాసులు..

|
Google Oneindia TeluguNews

తెలుగులో చాలా ఏళ్ల క్రితం రవితేజ హీరోగా 'దొంగోడు' అనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో మాధవన్ పాత్రలో రవితేజ దొంగోడిగా నటించాడు. తాను ఎవరి ముందైనా మీసం మెలేశాడంటే.. ఆ రాత్రికి అతని ఇంట్లో చోరీకి వెళ్తున్నాడని అర్థం. దొంగతనం గురించి అలా ఇన్‌డైరెక్ట్ హింట్ ఇస్తాడన్నమాట. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి దొంగే పుట్టుకొచ్చాడు. అయితే ఈ దొంగ 'దొంగోడు' సినిమాలో రవితేజ కంటే మహా ముదురు. డేట్,ప్లేస్ చెప్పి మరీ.. దొంగతనం చేయబోతున్నానంటూ ఏకంగా బహిరంగ లేఖనే రాశాడు.

ఏంటీ దొంగ కథ..

ఏంటీ దొంగ కథ..

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని త్రిలోకి నగర్‌లో ఉన్న వార్డు నంబర్ 19లో ఆదివారం ఓ కవర్ కనిపించింది. ఏంటా అని తెరిచి చూస్తే.. అందులో ఓ లేఖ కనిపించింది. ఆ లేఖతో పాటు ఒక గాజు,బ్రేస్ లెట్‌ కూడా అందులో ఉన్నాయి. 'త్రిలోకిలో దొంగతనం చేసేందుకు నేను మరోసారి రాబోతున్నాను. ఈసారి బైక్‌ను దొంగతనం చేయబోతున్నాను. జూన్ 9వ తేదీన నేనీ దొంగతనం చేయబోతున్నాను. ఏం చేస్తారో చేసుకోండి.ఇది నేను చేయబోయే 50వ దొంగతనం.' అని లేఖలో పేర్కొన్నాడు.

గతంలో ఇదే కాలనీలో 12 దొంగతనాలు

గతంలో ఇదే కాలనీలో 12 దొంగతనాలు

అంతేకాదు,మీ ఫోర్ వీలర్స్,టూ వీలర్స్‌కు లాక్ వేసుకుని భద్రంగా ఉంచుకోండి అని లేఖలో సదరు దొంగ గారు జాగ్రత్తలు కూడా చెప్పారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే త్రిలోకి నగర్‌లో 12 సార్లకు పైగా దొంగతనాలు జరిగినట్టు గుర్తించారు. ఈసారి ఏకంగా బహిరంగ లేఖ రాసి మరీ దొంగతనానికి పాల్పడబోతున్నట్టు ప్రకటించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Recommended Video

Vizag Gas Leak: High-Power Committee Meets Villagers, Political Parties
పోలీసులనే సవాల్ చేసిన దొంగోడు..

పోలీసులనే సవాల్ చేసిన దొంగోడు..


గతంలోనూ ఇలాగే ఆ దొంగల గ్యాంగ్ త్రిలోకి నగర్‌లో బైక్‌ చోరీలకు పాల్పడింది. స్థానిక సీఎస్పీ అశోక్ తివారీ మాట్లాడుతూ.. 'గత కొన్ని నెలల్లో ఇక్కడ రెండు భారీ చోరీలతో పాటు రెండు చిన్నపాటి చోరీలు జరిగాయి. అయితే నేరం చేసే ముందు ఏ దొంగైనా దాన్ని బహిరంగపర్చడం అసాధ్యం. ఈ లేఖ రాసింది కూడా స్థానికులను కేవలం భయాందోళనకు గురిచేసేందుకేనని భావిస్తున్నాం. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం.' అని చెప్పారు. స్థానికులు మాట్లాడుతూ.. డేట్,ప్లేస్ చెప్పి మరీ దొంగతనానికి రాబోతున్నామని హెచ్చరించారంటే.. వారు పోలీసులకే సవాల్ విసురుతున్నారని అన్నారు. ఇది శాంతిభద్రతలతో ముడిపడిన సమస్య అని.. పోలీసులు ఆ దొంగలను గుర్తించి వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
In Chhindwara, Madhya Pradesh, thieves wrote a letter to the police in film style and told the date and time of the theft. The thieves wrote in their letter that they would come again to steal. The thief wrote in the letter that this would be my 50th theft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X