వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయమూర్తి ఇంట్లో దొంగలు: గన్ పాయింట్‌లో బెదిరింపులు.. ఏం దోచుకెళ్లారో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఏకంగా న్యాయమూర్తి నివాసంలోనే చోరి దిగి..గంధపు చెట్లు చోరీ చేసిన ఘటన ఇది. మధ్య ప్రదేశ్ లోన రేవా జిల్లా న్యాయమూర్తిగా పని చేస్తున్న జిడ్డి అరుణ్ కుమార్ సింగ్ అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రలో ఉన్న సమయంలో ఆయన నివాసంలో చోరీ జరిగింది. పోలీసు కధనం ప్రకారం రేవా జిల్లా న్యాయమూర్తి నివాసంలో అర్ద్రరాత్రి సమయంలో న్యాయమూర్తి నివాసంలోకి ఒక అగంతకుడు ప్రవేశించాడు.

అక్కడ ఉన్న పోలీసుల గార్డును దేశీయ రివాల్వర్ తో బెదిరించాడు. ఆ వెంటనే మరో ముగ్గురు దొంగలు ప్రాంగణంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న గంధపు చెట్లను కోసుకొన వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని పైన స్వయంగా జిల్లా ఎస్పీ విచారణ ప్రారంభించారు. దొంగలను పట్టుకొనేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.

మధ్యప్రదేశ్ జిల్లా న్యాయమూర్తి నివాసంలో చోరీ జరిగింది. ఆయన నివాసంలోకి అర్ద్రరాత్రి దొంగలు ప్రవేశించారు. తొలుత అక్కడ గార్డుగా విధులు నిర్వహిస్తున్న పోలీసును రివాల్వర్ తో బెదిరించారు. ఆ వెంటనే మిగిలిన నలుగురు దొంగలు లోపలకు ప్రవేశించి ఆ ప్రాంగణంలో పెంచుతున్న గంధపు చెట్లను కోసుకొని వెళ్లిపోయారు. కేవలం పది నిమిషాల్లో తమకు కావాల్సిన వాటిని తీసుకొన్నారు.

Thieves attack judge house in Reva district in Madhyapradesh

ఈ సమయం లో న్యాయమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రలో ఉన్నారు. విషయం తెలుసుకున్న తరువాత జిల్లా ఎస్పీ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని సమాచారం సేకరించారు. దొంగలు కనౌజ్ ప్రాంతానికి చెందిన వారుగా అనుమానం వ్యక్తం చేసారు. గంధపు చెట్లను ఆ ప్రాంతంలో ఎక్కువగా వినియోగిస్తారు.

సుగంధ ద్రవ్యాలు..సెంట్ల ఉత్పత్తికి ఎక్కువగా అక్కడ అవసరం. దీంతో.అదే ప్రాంతానికి చెందిన వారు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు టీం లను ఏర్పాటు చేసారు. గాలింపు చర్యలు ప్రారంభించారు.

English summary
Thieves attack judge house in Reva district in Madhyapradesh. They threaten guard and chopped off sandal wood trees. Police started investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X