వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్ అండ్ రన్ కేసు: యువకుడి అరెస్టు

|
Google Oneindia TeluguNews

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య మూడుకు చేరిందని పోలీసులు చెప్పారు.

మంగళవారం వేకువ జామున జానీ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో తలదాచుకున్న సోనూ అలియాస్ షహనాజ్ అనే యువకుడిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్ జేడీ శాసన సభ్యుడు మహమ్మద్ సోహర్బ్ కుమారుడు సాంబియా సోహ్రాట్.

Third arrest in Kolkata hit and run case

శనివారం రాత్రి సాంబియా సోహ్రాట్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. సోనూ, జానీలను కోర్టులో హాజరుపరిచామని, ఇద్దరినీ తమ కష్టడీకి ఇవ్వాలని మనవి చేశామని కోల్ కతా నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (క్రైం) దేబశిష్ బొరాల్ తెలిపారు.

సోనూ అలియాస్ సాంబియా సోహ్రాట్ ను ఈనెల 30వ తేది వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు. వైమానిక దళ అధికారి అభిమన్యు గౌడ్ (21) ఈనెల 13వ తేదిన రిపబ్లిక్ డే పెరేడ్ ప్రాక్టీస్ లో పాల్గోని ఇంటికి బయలుదేరారు.

అదే సందర్బంలో సాంబ్రియా సోహ్రాట్, అతని మిత్రులు పీకలదాక మద్యం సేవించి అడీ కారులో బయలుదేరారు. తరువాత వైమానిక దళ అధికారి అభిమన్యు గౌడ్ ను కారుతో డీకొన్నారు. హిట్ అండ్ రన్ కేసులో తీవ్రగాయాలైన అభిమన్యు గౌడ్ మరణించారని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
The shocking incident occurred on January 13 when an Audi SUV rammed through police barricades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X