వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ మ్యూజిషియన్ మర్డర్: మరో బ్యాగును కనుగొన్న పోలీసులు...తెరిచి చూస్తే షాక్..!

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబై నేరాలకు అడ్డాగా మారుతోంది. కన్న కూతురును హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి సూట్‌కేసులో పెట్టి ఆటోలో ఉంచి పారిపోయిన తండ్రి ఘటన మరవకముందే మరో బ్యాగ్ కలకలం సృష్టించింది. ఈ బ్యాగులో ప్రముఖ సంగీత కళాకారుడు బెన్నెట్ రెబెల్లో శరీర భాగాలు ఉన్నాయి. ఈ బ్యాగును ముంబై పోలీసులు బంద్రా కుర్లా లోని మిథి నది తీరంలో కనుగొన్నారు.

వెన్నులో వణుకు : కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..ముక్కలుగా కోసి, ఇదే కారణంవెన్నులో వణుకు : కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..ముక్కలుగా కోసి, ఇదే కారణం

 డిసెంబర్ 2వ తేదీన రెండు బ్యాగులు కనుగొన్న పోలీసులు

డిసెంబర్ 2వ తేదీన రెండు బ్యాగులు కనుగొన్న పోలీసులు

ముంబైలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యకు గురైన మ్యుజీషియన్ బెన్నెట్ రెబెల్లో శరీరభాగాలు ఉంచిన సూట్‌కేసును డిసెంబర్ 2వ తేదీన ముంబైలోని మహీం ప్రాంతంలో పోలీసులు కనుగొన్నారు. ఆబ్యాగులో అతని కాలు, చేయి ప్రైవేట్ భాగాలు ఉన్నాయి. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు డిసెంబర్ 7వ తేదీన ఇద్దరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మృతుడు దత్తత తీసుకున్న కుమార్తె కూడా ఉంది. హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా కోసి మూడు సూట్‌కేసుల్లో సర్దారు. అనంతరం మిథి నదిలో పడేశారు.

హత్య చేసిన దత్తపుత్రిక మరియు ప్రియుడు

హత్య చేసిన దత్తపుత్రిక మరియు ప్రియుడు

బెన్నెట్ రెబెల్లో దత్తపుత్రిక అయిన 19 ఏళ్ల రియా 16 ఏళ్ల ఆమె ప్రియుడు నవంబర్ 27వ తేదీన బెన్నెట్‌ను ద్వారకా కుంజ్‌లోని తన ఇంట్లోనే హత్య చేశారు. వకోలా ప్రాంతంలో ఒంటరిగా నివాసముండేవారు బెన్నెట్. బెన్నెట్‌ ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇద్దరికీ దూరంగా ఉంటున్నాడు. హత్యచేశాక అతని శరీరంను మూడు సూట్‌కేసుల్లో ఉంచి ఒక్కో రోజు ఒక్కో సూట్‌కేసును నదిలో పడేశారు. ఇదిలా ఉంటే బెన్నెట్ తన కూతురిని లైంగికంగా వేధించడమే కాకుండా మైనర్ అయిన బాలుడితో ప్రేమ వ్యవహారం నడపడం ఇష్టం లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటి వరకు పోలీసులు రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

 మూడు రోజుల పాటు శరీరంను కోసిన నిందితులు

మూడు రోజుల పాటు శరీరంను కోసిన నిందితులు

రియా తన బాయ్‌ఫ్రెండ్‌ బెన్నెట్‌ను నవంబర్ 27వ తేదీన హత్య చేశారు. అనంతరం వరుసగా మూడు రోజులు అతని శరీరంను ముక్కలు చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం వారు వంటింట్లో వినియోగించే కత్తిని వాడారు. ఇక ఇంటినుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు అగరబత్తిలు వెలిగించారు. అనంతరం ముక్కలుగా చేసిన శరీర భాగాలను మూడు బ్యాగుల్లో ఉంచి మిథి నదిలో పడేశారు. డిసెంబర్ 2వ తేదీన సూట్‌కేసు నదిలో తేలియాడుతుండటాన్ని గమనించి పోలీసులు బయటకు తీయగా షాక్‌కు గురయ్యారు. మరో బ్యాగ్‌ను అదే రోజున మఖ్ధూం షా బాబా దర్గా వద్ద సాయంత్రం 6 గంటలకు కనుగొన్నారు.

 కేసులో కీలకంగా మారిన స్వెటర్

కేసులో కీలకంగా మారిన స్వెటర్

ఇక ముక్కలుగా కోసిన శరీర విడిభాగాలను ఒక ఎర్రటి స్వెటర్‌లో ఉంచారు. ఈ స్వెటర్‌ను ఆయన ఆల్మోమెన్స్ వేర్‌లో కుట్టించాడు. ఈ స్వెటర్ తొలి క్లూగా కేసులో నిలిచింది. ఈ స్వెటర్‌ను షాపుకు తీసుకెళ్లగా బెన్నెట్ పేరుతో రశీదు ఉంది. అప్పుడే ఈ మృతదేహం బెన్నెట్‌ది అయి ఉంటుందని పోలీసులు గుర్తించారు.ఆ తర్వాత బెన్నెట్‌కు సంబంధించిన విషయాలను కనుగొనేందుకు ఫేస్‌బుక్‌లో అతని పేరుతో వెతికారు. అందులో ఫోటోల్లో ఇదే స్వెటర్ ధరించి ఉన్న ఫోటోను బెన్నెట్ పోస్టు చేశాడు.

 ఫేస్‌బుక్ ఆధారంగా కేసును చేధించిన పోలీసులు

ఫేస్‌బుక్ ఆధారంగా కేసును చేధించిన పోలీసులు

ఫేస్‌బుక్ ఆధారాలతోనే మృతి చెందిన వ్యక్తి బెన్నెట్ అని నిర్థారించారు పోలీసులు. ఇక ఫేస్‌బుక్‌లోనే ఒక విజిటింగ్ కార్డు లభించడంతో దానిపై ఉన్న అడ్రస్‌ను పోలీసులు గుర్తించి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఇంటికి తాళం వేసి ఉంది. రెబెల్లో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక తీగ లాగితే డొంక బయటపడింది. నిందితులు పోలీసులకు చిక్కారు. ఇదిలా ఉంటే మంగళవారం రోజున పోలీసులకు మరో బ్యాగు చిక్కింది. ఇందులో కూడా రెబెల్లో శరీర విడిభాగాలు ఉన్నట్లు తెలిపారు.

English summary
The Mumbai Police on Tuesday recovered a suitcase from Mithi river in Bandra Kurla Complex (BKC) area containing a severed hand among other body parts of 59-year-old Bennett Rebello.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X