• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉనావ్‌లో మరో దారుణం : గ్రామస్తులంతా హోలీ బిజీలో ఉన్నవేళ.. మూడో తరగతి బాలికపై..

|

మహిళా రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు చిన్నారులపై కూడా అత్యాచారాలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్‌లో 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. గ్రామస్తులంతా హోలీ వేడుకల్లో బిజీగా ఉన్నవేళ ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ ఇదే ఉనావ్‌లో పలు అత్యాచార ఘటనలు బయటపడ్డ సంగతి తెలిసిందే.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్‌లో మూడో తరగతి చదువుతున్న బాలిక(12) హోలీ పండగ రోజు.. ఇంటి బయట నిలబడి హోలీ వేడుకలను చూస్తోంది. ఇంతలో ఓ యువకుడు ఆమెను తనవైపు రమ్మని సైగ చేశాడు. అతని మనసులో ఏముందో తెలియని ఆ చిన్నారి.. అమాయకంగా అతని వద్దకు వెళ్లింది. ఆ తర్వాత ఆమెను పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బలంగా ఆమె గొంతు నులిమాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి

అటుగా వెళ్లిన కొంతమంది గ్రామస్తులు.. బాలిక అక్కడ పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే చిన్నారి కుటుంబ సభ్యులకు,పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని హుటాహుటిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కారణంగా అక్కడినుంచి కాన్పూర్‌లోని హలెట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

బాలిక మృతితో కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు,బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. దీంతో స్థానిక ఎస్పీ విక్రాంత్ వీర్ అక్కడి చేరుకుని అదనపు బలగాలను మోహరించి.. బాధిత బాలిక కుటుంబ సభ్యులు,బంధువులను అక్కడినుంచి పంపించేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని చెప్పారు.

రేప్ ఘటనలతో తరుచూ వార్తల్లో ఉనావ్..

రేప్ ఘటనలతో తరుచూ వార్తల్లో ఉనావ్..

ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్ రేప్ కేసులతో తరుచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లో ఓ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా అడ్డగించిన నిందితులు.. ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను లక్నో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కూడా ఓ అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం పేరుతో ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడమే కాకుండా.. తన పలుకుబడితో ఆమె పైనే రివర్స్ కేసులు పెట్టించాడు సెంగార్. అంతేకాదు,ఆమె తండ్రిని అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టించడంతో అతను మృతి చెందాడు. అయినా సరే బాధితురాలు వెనక్కి తగ్గకుండా న్యాయం కోసం పోరాడింది. ప్రతిపక్షాలు బీఎస్పీ,ఎస్పీ కూడా ఆమెకు మద్దతుగా నిలిచాయి. చివరకు న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చడంతో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.

English summary
A class 3 student was allegedly raped and then strangulated on Tuesday in Bihar police circle of Unnao district.A local youth lured the girl, 12, to the fields when the rest of the village was busy playing Holi. There he raped her and then strangulated her. The youth apparently thought that she was dead and he fled the scene.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more