వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరపైకి థర్డ్‌ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో ఏర్పాటు, కేజ్రీవాల్ నాయకత్వం..? కేసీఆర్ కూడా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి జెండా ఎగరేస్తోంది. మెజార్టీ స్థానాలు సాధించుకొని అధికారం చేపట్టబోతోంది. ప్రధాని మోడీ ప్రభ, అమిత్ షా చాణక్యం ఫలించలేదు. దీంతో తెరపైకి థర్డ్ ప్రంట్ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని కూడగట్టి.. ఏకతాటిపైకి నడిపడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరసలో ఉన్నారు. బీజేపీ-కాంగ్రెస్‌తో కలిసిరాని పార్టీలతో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమిలో కేజ్రీవాల్ కీ రోల్ పోషిస్తారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెరపైకి థర్డ్ ఫ్రంట్

తెరపైకి థర్డ్ ఫ్రంట్

కేంద్రంలో కాంగ్రెస్ లేదంటే బీజేపీ అధికారం చేపడుతోన్నాయి. కాంగ్రెస్, బీజేపీని వ్యతిరేకించే పక్షాలు చేయి కలిపే అవకాశం ఉంది. తెరపైకి థర్డ్ ఫ్రంట్ పేరొచ్చినా.. కానీ నాయకత్వం వహించే నేతపై క్లారిటీ రాలేదు. అప్పుడప్పుడు తెరపైకి థర్డ్ ఫ్రంట్ వస్తోన్నా.. ముందుకు నడిపే నేతపై స్పష్టత రాలేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెరపైకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీని వ్యతిరేకించి పార్టీలతో అరవింద్ కేజ్రీవాల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోడీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో తీసిన ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.

నాలుగేళ్ల సమయం..

నాలుగేళ్ల సమయం..

గతేడాది లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున.. సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉంది. ఈ లోగా ప్రాంతీయ పార్టీ నేతలతో ముందుకుసాగి.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. ఆయా రాష్ట్రాల పార్టీల ప్రభ.. తెరపైకి థర్డ్ ఫ్రంట్ నేపథ్యంలో ప్రజలు కూడా విశ్వసిస్తారనే వాదన ఉంది. థర్డ్ ఫ్రంట్ కాక ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఇతర పార్టీల మద్దతు కూడగట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థర్డ్ ప్రంట్.. లేదంటే ఫెడరల్ ఫ్రంట్.. ప్రాంతీయ పార్టీలు కలిసి ముందుకుసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి అంకురార్పణ ఎప్పుడు పడుతుందో అనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు.

ఫెడరల్ ఫ్రంట్..

ఫెడరల్ ఫ్రంట్..

కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలని కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగారు. ప్రాంతీయ పార్టీల మద్దతును కూడా కూడగట్టారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మాయావతిని కలిసి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు. ఫ్రంట్ ఏర్పాటు కోసం ముందుకొస్తామని ఆయా నేతలు ప్రకటించారు. కానీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం.. బీజేపీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. విపక్ష కాంగ్రెస్.. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు షేక్ అయ్యాయి. దీంతో ఫెడరల్ ఫ్రంట్ కనుమరుగైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విజయంతో మళ్లీ తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది.

Recommended Video

#DelhiElectionResults: AAP Crosses Majority Mark In Early Trends
అడుగుదూరంలో..

అడుగుదూరంలో..

ఢిల్లీ విజయంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఆప్ భారీ మెజార్టీతో విజయం బీజేపీకి చెంపపెట్టు అన్నారు. మిగతా నేతలు కూడా స్పందించాల్సి ఉంది. వారంతా కలిసి బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు గురించి డిస్కష్ చేసే అవకాశం కనిపిస్తోంది.

English summary
delhi election results 2020: third front will be establish delhi cm arevind kejriwal leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X