వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగేశ్వరరావు కూతురి వివాహానికి హాజరయ్యా..సీబీఐ కేసును విచారణ చేయలేను: జస్టిస్ ఎన్వీ రమణ

|
Google Oneindia TeluguNews

సీబీఐ కేసులో లొల్లి ఇంకా కొనసాగుతోంది. మధ్యంతర డైరైక్టర్‌గా నాగేశ్వరరావు నియామకం నిబంధనల ప్రకారం జరగలేదంటూ దాఖలైన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసు విచారణ చేసే బెంచ్‌ నుంచి ఇప్పటికే ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రీలు తప్పుకోగా తాజాగా జస్టిస్ ఎన్వీ రమణ కేసు విచారణ చేసే ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ చేయలేమంటూ చేతులెత్తేసిన జడ్జీలు సంఖ్య మూడుకు చేరుకుంది.

ఇదిలా ఉంటే మధ్యంతర డైరెక్టరుగా నాగేశ్వరరావు నియామకాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందుగా తప్పుకున్నారు. తాను తదుపరి డైరెక్టర్‌ను ఎంపిక చేసే ప్యానెల్‌లో సభ్యునిగా ఉండటంతో తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇక ధర్మాసనంలో ఉన్న మరో మరో జడ్జి ఏకే సిక్రీ కూడా తప్పుకున్నారు. అయితే ఎలాంటి వివరణ ఆయన ఇవ్వలేదు. అలోక్ వర్మ తొలగింపు విషయంలో సెలెక్షన్ కమిటీ ప్యానెల్ సభ్యునిగా జస్టిస్ సిక్రీని నామినేట్ చేశారు జస్టిస్ రంజన్ గొగొయ్.ఇక అలోక్ వర్మ తొలగింపులో ప్రధాని నరేంద్ర మోడీ బాటలోనే జస్టిస్ అలోక్ వర్మ పయనించారు. అయితే విపక్షనేత మల్లికార్జున ఖర్గే మాత్రం అలోక్ వర్మ తొలగింపును తప్పుబట్టారు.

Third SC Judge recuses from hearing Plea Against Nageswara Raos Appointment as Interim CBI Chief

నాగేశ్వరరావు తన సొంత రాష్ట్రానికి చెందిన వాడని అతని కూతురు వివాహానికి కూడా తాను హాజరైనందువల్ల ఈ కేసును తాను విచారణ చేయలేనని కారణంగా చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. అయితే పిటిషనర్ తరుపున వాదిస్తున్న న్యాయవాది దుష్యంత దవే త్వరతగతిన కేసు విచారణ వచ్చేందుకు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ చొరవ చూపాల్సిందిగా కోరాలని జస్టిస్ ఎన్వీ రమణను అభ్యర్థించారు. అయితే తను ప్రధాన న్యాయమూర్తికి ఎలా చెబుతానని ఫలానా కేసు విచారణకు సంబంధించి పిటిషన్‌ను జాబితాలో చేర్చాల్సిన బాధ్యత రిజిస్ట్రీది అని వెల్లడించారు. జస్టిస్ రమణతో పాటు జస్టిస్ మోహన్ ఎమ్ శంతనగౌడార్ , జస్టిస్ ఇంద్ర బెనర్జీ కేసు విచారణ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రతిసారీ కేసు విచారణలో జాప్యం జరుగుతుండటం తప్పుడు సంకేతాలు పంపుతోందని న్యాయవాది దుశ్యంత్ దవే అభిప్రాయపడ్డారు.

ఇక నాగేశ్వరరావు నియామకాన్ని తప్పుబడుతూ ఎన్జీఓ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నియామకంలో పారదర్శకత లోపించిందని అభిప్రాయపడింది. ఇది ఇలా ఉంటే శుక్రవారం రోజున ప్రధానమంత్రి ఛీఫ్ జస్టిస్, ఖర్గేలతో కూడిన సెలెక్షన్ ప్యానల్ సమావేశమై కొత్త సీబీఐ డైరెక్టరును ఎంపిక చేసే అవకాశం ఉంది.

English summary
Justice NV Ramana recused himself from hearing the petition challenging the appointment of M Nageshwar Rao as the interim director of the Central Bureau of Investigation. He is the third Supreme Court judge to have exited the case after Chief Justice of India Ranjan Gogoi and Justice AK Sikri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X