వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలీకి దూరమవాల్సి వస్తుందని.. గర్భాశయం తొలగించుకున్న 30వేల మంది మహిళలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలోని చెరుకు తోటల్లో పనిచేస్తున్న మహిళల దుస్థితిపై కాంగ్రెస్ నేత,ఆ పార్టీ షెడ్యూల్డ్ కులాల శాఖ చైర్మన్ నితిన్ రౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి లేఖ రాశారు. బీడ్,ఒస్మానాబాద్ జిల్లాల్లోని చెరుకు తోటల్లో పనిచేస్తున్న చాలామంది మహిళలు తమ గర్భాశయాన్ని తొలగించుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

ప్రతీ నెలా రుతుక్రమం సమయంలో పనికి దూరం కావాల్సి వస్తుండటంతో.. ఆ దినాల్లో కూలీని కోల్పోతున్నామని వారు ఆవేదన చెందుతున్నట్టుగా తెలిపారు. ఈ కారణంతోనే చాలామంది మహిళలు రుతుస్రావం జరగకుండా గర్భాశయాన్ని తొలగించుకుంటున్నారని చెప్పారు.

thirty thousand got uterus removed to avoid wage loss in maharashtra

ఇప్పటివరకు దాదాపు 30వేల మంది మహిళలు తమ గర్భాశయాన్ని తొలగించుకున్నారని తెలిపారు. కూలీ వేతనం కోసం గర్భాశయాన్ని తొలగించుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.

English summary
Congress leader Nitin Raut, who is chairman of the party's scheduled caste department on Wednesday, wrote a letter to Maharashtra Chief Minister Uddhav Thackeray urging him to take some significant steps to help the women working in the sugarcane fields of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X