వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు బచ్చా, నేడు కింగ్ మేకర్, బహిష్కరించిన పార్టీని అడ్రస్ లేకుండా చేసిన దుశ్యంత్ !

|
Google Oneindia TeluguNews

చండీగడ్:రక్త సంబంధం అనికూడా చూకుండా, ఏ పార్టీ అయితే తనను బహిష్కరించిందో అదే పార్టీని అడ్రస్ లేకుండా చేశాడు జననాయక జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుశ్యంత్ చౌటాలా. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాచాటి ఇంత కాలం తనను చులకనగా చూసి ప్రత్యర్థి పార్టీతో సహ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు తన సత్తా చాటాడు దుశ్యంత్ చౌటాలా. 30 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎన్డీఏ చైర్మన్ సోనియా గాంధీకి తన సత్తా చాటిన జేజేపీ పార్టీ చీఫ్ దుశ్యంత్ చౌటాలా కథ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసుపోదు. నాడు బచ్చా అని ఎగతాలి చేసిన వారికి నేడు దుశ్యంత్ చౌటాలా కింగ్ మేకర్ అయ్యారు.

ట్విస్ట్: తండ్రికి అవమానం, బెంగళూరులో ఆంధ్రా విద్యార్థి ఆత్మహత్య, రూ. 14 లక్షల జీతం !ట్విస్ట్: తండ్రికి అవమానం, బెంగళూరులో ఆంధ్రా విద్యార్థి ఆత్మహత్య, రూ. 14 లక్షల జీతం !

దుశ్యంత్ చౌటాలా S/o అజయ్ చౌతాలా

దుశ్యంత్ చౌటాలా S/o అజయ్ చౌతాలా

దుశ్యంత్ చౌటాలా S/O అజయ్ చౌటాలా, దుశ్యంత్ చౌటాలా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌటాలా మనుమడు, మాజీ ఉప ప్రధాని జననాయక్ చౌదరి దేవిలాల్ కి దుశ్యంత్ చౌటాలా మునిమనుమడు.హరియాణాలో చౌటాలా కుటుంబ సభ్యులకు చాలా పెద్ద పేరు ఉంది. చౌటాలా కుటుంబ సభ్యులు హరియాణాలో చాల ప్రభావంతమైన, శక్తివంతమైన రాజకీయ నాయకులు. అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన దుశ్యంత్ చౌటాలా నేడు హరియాణాలో కింగ్ మేకర్ అయ్యారు.

అమెరికాలో చదవు

అమెరికాలో చదవు

అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన దుశ్యంత్ నేషనల్ యూనివర్శిటీలొ మాస్టర్ ఆఫ్ లా (లా) పూర్తి చేశారు. 26 ఏళ్ల వయసులో 2014 లోక్ సభ ఎన్నికల్లో హరియాణాలోని హిన్సార్ నియోజక వర్గం నుంచి 31, 847 ఓట్ల మెజారిటీతో దుశ్యంత్ చౌటాలా ఎంపీగా విజయం సాధించారు. 16వ పార్లమెంట్ లో అతి చిన్న వయసు ఎంపీగా దుశ్యంత్ చౌటాలా గుర్తింపు తెచ్చుకున్నారు. దాయాదుల రాజకీయాలతో 10 నెలల క్రితం INLD పార్టీ నుంచి దుశ్యంత్ చౌటాలా సోదరులను బహిష్కరించారు.

జననాయక జనతా పార్టీ దెబ్బ

జననాయక జనతా పార్టీ దెబ్బ

మహాభారం కథలాగే చౌటాలా కుటుంబంలో తండ్రి, చిన్నాన (దాయాదులు)ల రాజకీయాలతో INLD పార్టీలో దుశ్యంత్ చౌటాలకు ఇబ్బందులు ఎదురైనాయి. తండ్రి అజయ్ చౌటాలా, చిన్నాన అభయ్ చౌటాలాల మధ్య INLD పార్టీలో రాజకీయ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దాని ఫలితంగా దుశ్యంత్ చౌటాలా సోదరులు, అనుచరులను INLD పార్టీ నుంచి బహిష్కరించారు. కసి, పగతో పార్టీ నుంచి బయటకు వచ్చిన దుశ్యంత్ చౌటాలా 10 నెలల క్రితం జననాయక జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. 2018 డిసెంబర్ 9వ తేదీన దుశ్యంత్ చౌటాలా నిర్వహించిన జేజేపీ పార్టీ బహిరంగ సభలో ఆరు లక్షల మందికి పైగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ముత్తాత జననాయక పేరుతో పార్టీ స్థాపించిన దుశ్యంత్ ముత్తాత, తాతలకు సరైన రాజకీయ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

విద్య, ఉద్యోగం, వ్యవసాయం, ఆరోగ్యం

విద్య, ఉద్యోగం, వ్యవసాయం, ఆరోగ్యం

విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయానికి తమ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, మమ్మల్ని ఆదరించాలని హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో దుశ్యంత్ చౌటాలా ప్రజలను ఆకర్షించారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో దుశ్యంత్ చౌటాలా విజయం సాధించారు. మొదటి సారి హరియాణాలోని జింద్, హరియాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో జేజేపీని రెండవ స్థానంలో నిలిపిన దుశ్యంత్ చౌటాలా తన సత్తా చాటుకున్నారు. ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చిన దుశ్యంత్ చౌటాలా ప్రత్యర్థి INLD పార్టీకి సినిమా చూపించారు.

చిన్నాన పార్టీ ఔట్

చిన్నాన పార్టీ ఔట్

2019 హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుశ్యంత్ చౌటాలా స్థాపించిన జననాయక జనతా పార్టీ (JJP) 10 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో దుశ్యంత్ చౌటాలా చిన్నాన అభయ్ చౌటాలా పార్టీ INLD పోటీ చేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న INLDపార్టీ ఈ అసెంబ్లీ ఎ న్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుకు పరిమితం అయ్యింది. దుశ్యంత్ చౌటాలా చిన్నాన అభయ్ చౌటాలా పార్టీని అడ్రస్ లేకుండా చేశారు.

నాడు బచ్చా, నేడు కింగ్ మేకర్

నాడు బచ్చా, నేడు కింగ్ మేకర్

10 నెలల క్రితం జననాయక జనతా పార్టీ (JJP)స్థాపించిన దుశ్యంత్ చౌటాలాను చూసి ఆయన చిన్నాన అభయ్ చౌటాలా, ఆ పార్టీ నాయకులు ఓ బచ్చా స్థాపించిన పార్టీ మాకు ఎంత మాత్రం పోటీ కాదని ఎద్దేవ చేశారు. అయితే జూట్లను ఏకం చేసి యువతను ఆకర్షించిన దుశ్యంత్ చౌటాలా మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ప్రత్యర్థి ఐఎన్ఎల్ డీకి గట్టి పోటీ ఇచ్చి తన సత్తా చాటారు. మొత్తం మీద దాయాదుల కలహాలతో హరియాణాలో ఓ యువ నాయకుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టి తన సత్తా చాటారు.

English summary
Thirty Year Old Politician Dushyant Chautala of Jannayak Janata Party has Given Civiar Setback To INLD. JJP Won 10 Seats, While INLD Won Just One.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X