వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమల మకరవిలక్కు, తిరుణాభరణం ఊరేగింపు ప్రారంభం, సంక్రాంతికి సన్నిధానంలో !

|
Google Oneindia TeluguNews

శబరిమల/కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నియమాలను పాటిస్తూ శబరిమలలో మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా అయ్యప్పస్వామికి సాంప్రధాయబద్దంగా పూజలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి రోజుకు ఊరేగింపు శబరిమలకు చేరుకుంటుంది.

అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టమైన బంగారు నగలు తీసుకెళ్లే పవిత్రమైన తిరునాభరణం కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. అయ్యప్పస్వామికి అలకంరించే తిరునాభారణం ఊరేగింపు కార్యక్రమం మంగళవారం పందలంలోని వయియాకోయక్కల్ ధర్మస్థ ఆలయం నుంచి ప్రారంభం అయ్యింది.

Thiruvabharanam procession has commenced on Tuesday morning from Pandalam Valiyakoikkal Dharmasastha temple.

మంగళవారం పందలంలో ప్రారంభం అయిన తిరునాభరణం ఊరేగింపు కార్యక్రమం రంగరంగ వైభవంగా మకర సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీన శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంకు చేరుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నియమాలు అన్ని పాటిస్తూ మంగళవారం సాంప్రధాయబద్దంగా తిరునాభరణం ఊరేగింపు ప్రారంభించామని శబరిమల ఆలయ కమిటీ నిర్వహకులు తెలిపారు.

తిరునాభరణం ఊరేగింపు కార్యక్రమానికి అతి తక్కువ మంది అయ్యప్పస్వామి భక్తులు మాత్రమే హాజరైనారు. గత ఏడాది తిరుణాభరణం ఊరేగింపు కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది దేవాలయం పరిసర ప్రాంతాల్లో కోవిడ్ నియమాలు పాటిస్తూ ఆ ప్రాంతాలు శుభ్రం చెయ్యడానికి సమయం పట్టడంతో మంగళవారం ఉదయం 11. 45 గంటలకు తిరునాభరణం ఊరేగింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మొత్తం మీద మంగళవారం ప్రారంభం అయిన తిరునాభరణం కార్యక్రమం మకర సంక్రాంతి పండుగ రోజున శబరిమలకు చేరుకుంటుంది.

English summary
Sabarimala: Thiruvabharanam procession has commenced on Tuesday morning from Pandalam Valiyakoikkal Dharmasastha temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X