వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ చిన్నారి కష్టం ఎవరికీ రాకూడదు: మీ సాయంతో ఆమె ప్రాణం నిలబడుతుంది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'న్యుమోనియా ఎమ్పిమీ నెక్రోయోటైజింగ్' అనే వ్యాధితో తన రెండేళ్ల చిన్నారి కూతురు నిర్వి బాధపడుతోందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, తనకు మిల్క్ చాక్లెట్ కావాలని వైద్యుడిని అడుగుతోందని వాపోయాడు. అయితే, ఆమె ఏం తినలేని పరిస్థితిలో ఉందని చెప్పాడు. తమ కూతురు బాధపడుతుంటే చూడలేకపోతున్నామని తెలిపాడు.

సాధారణ న్యూమోనియా లాంటి వ్యాధి అయినప్పటికీ తన కూతురుపై అంటిబయోటిక్‌లు పనిచేయడం లేదని తెలిపాడు. తన కూతురు శరీరంలోని గోడలు, లంగ్స్‌లోకి రక్తం, వాటర్ చేరిపోయిందని, దీని వల్ల మరింత సమస్య ఏర్పడిందని చెప్పాడు. తన పాపకు వ్యాట్స్(వీడియో అసిస్టెడ్ థోరస్కోపికి్ సర్జరీ) తొలి సర్జరీ జరిగిందని తెలిపాడు. అయినా, ఆమెకు నయం కాకపోవడంతో త్వరలో మరో సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారని తెలిపాడు. తన కూతురుకు వ్యాధి నయం కావాలంటే మరో 3వారాలపాటు ఆస్పత్రిలోనే ఉండాలని, ఆమె చికిత్సకు రూ.15లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పాడు.

ఆ తండ్రి చిన్నారి తండ్రి ఆవేదన ఆయన మాటల్లోనే.. నా పేరు మనోజ్ కుమార్. అయిరోలిలో తన భార్య, తల్లి, సోదరుడు, నిర్వీతో కలిసి ఉంటానని చెప్పాడు. వెస్టెర్న్ రైల్వేలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. నా నెల జీతం రూ.20వేలు. ఇప్పటికే నా కూతురు వైద్య కోసం రూ.4.5లక్షలు పెట్టాను. ఇక నా వద్ద ఖర్చు చేసేందుకు ఏం లేదు. నా మెడిక్లెయిమ్ ద్వారా రూ.3లక్షలు, నా కారు అమ్మడం ద్వారా వచ్చిన రూ.1.5లక్షలు కూడా ఆమె చికిత్స కోసం ఖర్చు చేసినట్లు తెలిపాడు. ఇప్పుడు ఆమె చికిత్సకు చెల్లించేందుకు తన వద్ద ఏమీ లేదని వాపోయాడు. నా కూతురు చికిత్స చేయించలేనేమోనన్న భయంతో తమకు తిండి, నిద్ర లేకుండా పోయిందని చెప్పాడు.

మీరు మనోజ్ కూతురు నిర్వీ చికిత్సకు సాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నేను నా కలలో కూడా అనుకోలేదు నా నిర్వీని ఇలా ఆస్పత్రి బెడ్ చూస్తానని. ఒక్కగానొక్క కూతురును ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. సర్జరీ చేస్తేనే ఆమె జీవించగలుగుతుంది. నిర్వీ జలుబు, దగ్గు రావడంతో స్థానిక వైద్యుడి వద్ద చూపించాం. ఆ వైద్యుడు ఇచ్చిన మందులు వాడినప్పటికీ నిర్వీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో మరో ఆస్పత్రికి తరలించాం. అక్కడ ఈ భయంకరమైన వ్యాధి నా కూతురుకు వచ్చిందని తెలింది. నెల రోజుల నుంచి నా కూతురు నరకం అనుభవిస్తోంది.

ఆమెకు రక్త పరీక్షలు చేయగా ఇన్ఫెక్షన్ వచ్చిందని తేలింది. తాము ఇచ్చిన మందులను వాడమని వైద్యులు సూచించారు. దీంతో ఇంట్లోనే ఆమెకు మందులు వాడాం. అయితే, ఎప్పుడూ తన తల్లిని హత్తుకుని పడుకునే నా కూతురు.. బెడ్ పై అలా నీరసంగా ఉండిపోయింది. అర్ధరాత్రి లేచి ఊపిరి తీసుకునేందుకు నా పాప ఎంతో ఇబ్బంది పడేది. దీంతో వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాం. అక్కడే నా కూతురుకు భయంకరమైన ఈ వ్యాధి ఉందని తేలింది.

రెండు ట్యూబ్స్ నా పాప శరీరంలోకి పంపి చికిత్స చేశారు. లంగ్స్‌లోని మలిన పదార్థాలను ఆ ట్యూబ్స్ ద్వారా తొలగించారు. అంత నొప్పి భరించిన తర్వాత ఆమెకు సాధారణంగా ఊపిరి తీసుకోవడం సాధ్యమైంది. కానీ, శాశ్వతంగా నా కూతురు ఈ వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే ముఖ్యమైన మరో సర్జరీ చేయాల్సి ఉంది.

నిర్వీకి అన్ని ఆటలంటే ఇష్టం. ఖో-ఖో అంటే ఆమెకు చాలా బాగా ఇష్టం. ఆమె తన నడక నేర్చినప్పటి నుంచి ఈ ఆట ఆడుతోంది. తన చిన్న సైకిల్ పై ఎక్కి ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. ప్రతి రోజూ నిద్ర పోయేముందు నేను నా కారు శుభ్రం చేసేటప్పుడే తన సైకిల్ ను కూడా కడగాలని కోరేది. మనం ఎప్పుడు ఇంటికి వెళతామని నన్ను అడుగుతోంది ఇప్పుడు. దయ చేసి నా కూతురు ప్రాణాలు కాపాడేందుకు మీకు తోచిన సాయం చేయండి. నాకు నా కూతురే ప్రపంచమంటూ కన్నీరు పెట్టుకున్నాడు మనోజ్.

ఈ చిన్నపాప శస్త్ర చికిత్సకు విరాళంగా ఇవ్వాలనుకుంటే క్లిక్ చేయండి.

English summary
“Doctor uncle, can I get chocos and milk today please?”, my 2-year-old daughter Nirvi asks the doctor flashing her best smile, hoping for a yes. She misses beginning her day with her favourite breakfast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X