వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి సైకిల్‌పై బట్టలు అమ్మి చదివించాడు... ఆ పట్టుదల,సంకల్పమే అతన్ని సివిల్స్ టాపర్‌గా నిలబెట్టాయి...

|
Google Oneindia TeluguNews

అతని తండ్రి సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ బట్టలు అమ్ముతుంటాడు. అలా సంపాదించిన డబ్బుతోనే తనను ఉన్నత చదువు చదివించాడు.తండ్రి పడుతున్న కష్టాలు,పేదరిక నేపథ్యం జీవితం పట్ల అతనికి మరింత పట్టుదలను,సంకల్పాన్ని నూరిపోశాయి. ఆ పట్టుదల,సంకల్పమే ఇవాళ అతన్ని ఐఏఎస్‌గా నిలబెట్టాయి. ఆ వ్యక్తి బిహార్‌లోని కిషన్‌గంజ్‌కి చెందిన అనిల్ బోసక్.

తాజాగా ప్రకటించిన సివిల్స్-2020 ఫలితాల్లో అనిల్ బోసక్ జాతీయ స్థాయిలో 45వ ర్యాంకు సాధించాడు.దీంతో అనిల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఐఐటీ ఢిల్లీలో చదివిన అనిల్ బోసక్.. మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు.కుమారుడు ఐఏఎస్ సాధించడంపై సంతోషం వ్యక్తం చేసిన అతని తండ్రి... ఇదంతా తనకో కలగా అనిపిస్తుందన్నాడు.

this bihar iit graduate got civils 45th rank his father sells clothes on cycle

'మొదట అతను ఐఐటీ నుంచి ఉత్తీర్ణుడయ్యాడు.అప్పుడు చాలా సంతోషించాం. చదువైంది కదా పనిచేస్తాడేమో అనుకున్నా.కానీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతానని చెప్పాడు.ఆ విషయంలో అతని టీచర్ చాలా సాయపడ్డారు.ఆర్థికంగానూ సాయం చేశారు.' అని అనిల్ బోసక్ తండ్రి తెలిపారు. 'నిజానికి ఇది చాలా కష్టమైనది.నేనైతే కల అనుకుంటున్నా.నేను చదువుకోలేదు.' అని పేర్కొన్నారు.

అనిల్ బోసక్ ఇంటికి ఇప్పుడు చాలామంది స్వీట్ బాక్సులతో వెళ్తున్నారు.అనిల్‌తో పాటు అతని కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనిలో సోదరుడు బబుల్ బోసక్ మాట్లాడుతూ...'మాకు చాలా సంతోషంగా ఉంది.గతేడాది సివిల్స్‌లో అనిల్‌కు 616 ర్యాంకు వచ్చింది.దీంతో మరోసారి ప్రయత్నిస్తానని చెప్పాడు.ఈసారి 45వ ర్యాంకు తెచ్చుకున్నాడు.అనిల్ ర్యాంకు చూసి మేమంతా ఆశ్చర్యపోయాం.ఇది మా జిల్లాకే గర్వకారణం' అని పేర్కొన్నాడు.

సివిల్స్-2020 ఫ‌లితాల‌ను యూపీఎస్సీ శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 761 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో 263 మంది, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరిలో 86 మంది, ఓబీసీ కేట‌గిరిలో 229, ఎస్సీ కేట‌గిరిలో 122, ఎస్టీ కేట‌గిరిలో 61 మందిని ఎంపిక చేశారు. సివిల్స్-2020 ఫ‌లితాల్లో 545 మంది పురుషులు, 216 మంది మ‌హిళ‌లు ఎంపిక‌య్యారు.

సివిల్స్ టాపర్‌గా ఐఐటీ ముంబైకి చెందిన శుభం కుమార్‌ నిలవగా, జాగృతి అవ‌స్థికి రెండో ర్యాంకు, అంకితా జైన్‌కు మూడో ర్యాంకు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పి.శ్రీజ‌ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు, దేవ‌గుడి మౌనిక‌కు 75వ ర్యాంకు, ర‌వికుమార్‌కు 84వ ర్యాంకు, య‌శ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు, ప్ర‌శాంత్ సూర‌పాటి 498వ ర్యాంకు, తిరుప‌తి రావు 441వ ర్యాంకు, సౌమిత్ రాజు కే 355వ ర్యాంకు, అభిషేక్ నాయుడికి 616వ ర్యాంకు, ఈ వేగినికి 686వ ర్యాంకు, డి విజ‌య‌బాబుకు 682వ ర్యాంకు, క‌ల్లం శ్రీకాంత్ రెడ్డికి 747వ ర్యాంకు వ‌చ్చాయి.

English summary
Anil Bosak from Bihar got 45th rank in UPSC 2020 results.His father sells clothes on cycle to feed his family.Anil who completed IIT graduation got this rank after three attempts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X