వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో సింగం-4: ఢీ అంటే ఢీ అన్న మహిళా పోలీసు అధికారి

యూపీలోని బులంద్ షహర్ ప్రాంతంలో మహిళా పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రేష్ఠా ఠాకూర్ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: మీరు సింగం-4 సినిమా చూశారా? అర్రె... అదెప్పుడొచ్చింది అనుకుంటున్నారా? వచ్చింది.. కాకపోతే దేశ వ్యాప్తంగా కాదు, ఒక్క యూపీలోనే.. అందులోనూ బులంద్ షహర్ ప్రాంతంలోనే విడుదలైంది.

అయితే ఈ సినిమాలో హీరో సూర్య కాదు.. శ్రేష్ఠా ఠాకూర్. ఈమెది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రే.. అర్థం కాలేదా? అయితే పూర్తిగా చదవండి. ఈ సంఘటన గతవారం జరిగింది. కాకపోతే దాని తాలూకు వీడియోలు మాత్రం రెండ్రోజుల నుంచే సామాజిక మాధ్యమాల్లో వీరవిహారం చేస్తున్నాయి.

This brave UP woman police officer teaches unruly BJP workers a perfect lesson

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో బులంద్‌షహర్‌ అనే ప్రాంతం అది. అక్కడ పోలీస్‌ సర్కిల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న శ్రేష్ఠా ఠాకూర్‌ మోటారు బైకుపై అటుగా వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి లైసెన్స్‌ అడిగింది. అతని దగ్గర లేదు. 'నేను అధికారపార్టీ జిల్లాస్థాయి కార్యకర్త'ని అంటూ అతడు గీర ప్రదర్శించాడు.

అయినా సరే మన లేడీ సింగం ఊరుకోలేదు. అతనికి చలాన్‌ ఇచ్చి రూ.2 వేలు కట్టమని చెప్పింది. అయినా సరే అతడు లెక్కచేయలేదు. ఎంతైనా అధికారపార్టీ వ్యక్తి కదా. ఆ గర్వాన్ని పబ్లిక్ లో ప్రదర్శించాలనుకున్నాడు.

శ్రేష్ఠా, ఆమెతో ఉన్న కానిస్టేబుల్‌పై అతడు పెద్ద ఎత్తున అరవడం మొదలుపెట్టాడు. అతను ఆ పని చేస్తుండగానే అరెస్టుచేసి.. వూచలు లెక్కపెట్టించింది మన లేడీ సింగం. అంతటితో ఊరుకోలేదు, అతడిని న్యాయస్థానంలోనూ హాజరుపరిచింది! అక్కడా ఆమెపై నోరుపారేసుకుంటే, మరో కొత్త సెక్షన్‌ వేసి జైల్లో పెట్టిందామె.

అంతే.. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల అధికారపార్టీ దండు మొత్తం ఆమె పోలీసుస్టేషన్‌ ముందు ధర్నాకు దిగింది. ఓ పాతికమంది దాకా ఆమెని చుట్టుముట్టారు. అయినా సరే శ్రేష్ఠా ఠాకూర్ ఏమాత్రం తొణకలేదు.. బెణకలేదు. హుందాగా, ధీమాగా నడుంపై చెయ్యేసి నిల్చుని.. అంతమందికీ తానొక్కతే ధాటిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టింది.

'మేం రాత్రి ఇంట్లో పిల్లాపాపల్ని వదిలేసి ఇక్కడికొచ్చేది ఆట్లాడటానికి కాదు. మా విధులు మేం చేయడానికి. సరైన పత్రాల్లేకుండా స్కూటర్‌ నడిపేవాళ్లపై చర్యలు తీసుకోవడం మా విధి. నేను అదే చేశాను. మీకంత అభ్యంతరం అయితే 'పోలీసులు వాళ్ల విధులు చేయాల్సిన అవసరం లేదు' అని ముఖ్యమంత్రి నుంచి లేఖ తీసుకురండి. అప్పుడు నేను పనిచేయడం మానేస్తా..' అంది సూటిగా.

అంతేకాదు, 'అధికారపార్టీ అని ఇలాంటి చేష్టలకి దిగితే ప్రజలు మిమ్మల్ని గూండాలంటారు జాగ్రత్త!' అని కూడా హెచ్చరించింది. ఈ హడావుడిని ఎవరో వీడియో తీస్తే మీడియా ప్రసారం చేసింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌ గా మారంది. మీరూ ఓ లుక్కేయండి.. ఎంతైనా 'సింగం-4' కదా!

English summary
The video shows Thakur, a circle officer from Sayana, firmly standing her ground against BJP protesters at the district court compound in Bulandshahr. The situation turned tense after BJP workers protested against police for taking action against one of their leaders for traffic violation. The BJP workers, gathered near the court compound, shouted anti-police slogans. Afterwards, Thakur had a confrontation with a BJP leader. In the video, Thakur was seen surrounded by BJP workers, who were all males. However, she did not blink an eye and told the crowd that why the action taken by the police was right. The fearless officer told a BJP leader that he first gets an order in writing from chief minister Yogi Adityanath that the police have no powers to check vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X