వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిదా అవ్వాల్సిందే: ఆనంద్ మహీంద్ర ఈ చెప్పులు కుట్టుకునే పెద్దాయనకు ఇచ్చిన కానుకేంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఆయన ఓ ప్రముఖ బిజినెస్ టైకూన్. ప్రపంచదేశాలకు ఆయన వ్యాపార స్రామాజ్యాన్ని విస్తరింపజేశారు. క్షణం తీరిక ఉండదు... నిత్యం వ్యాపారం గురించే ఆలోచన అంతా... తను ఇంటినుంచి ఆఫీసుకెళ్లే దారిలో మాత్రమే బయట ప్రపంచాన్ని చూస్తారు. ఏదైనా ఆసక్తిగా కనిపిస్తే దాని గురించి ఆలోచిస్తారు. ఇంతకీ ఎవరీ బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా.. ఆయనే మహీంద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్ర. ఆనంద్ మహీంద్ర కేవలం పారిశ్రామికవేత్తే కాదు... మంచి మనసున్న మారాజు కూడా.... అందుకు ఈ ఘటనే నిదర్శనం.

This business tycoon gifted a Kiosk to this roadside cobbler

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఓ రోజు ఆనంద్ మహీంద్ర తన ఆఫీసుకు వెళుతూ ఫుట్ పాత్ పైన చెప్పులు కుట్టుకునే నర్సీరాం అనే ముసలాయనను చూశాడు. అంతకంటే ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది ఆ నర్సీరాం డిస్‌ప్లే చేసిన బోర్డు. ఇంతకీ ఆ బోర్డులో ఏమి రాసిందో తెలుసా.. జక్మీ జూతో కా హాస్పిటల్ అని హిందీలో రాసి ఉంది. గాయపడ్డ బూట్లకు ఇక్కడ చికిత్స చేయబడును అని దీని అర్థం.నర్సీరాం పెట్టిన బోర్డుపై పనివేళలు కూడా దర్శనమిచ్చాయి. నర్సీరాం మార్కెటింగ్ నైపుణ్యత ఆనంద్ మహీంద్రను కట్టిపడేసింది. వెంటనే కారులోనుంచే అతని ఫోటో తీసుకుని ట్వీట్ చేశాడు. ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఈ వ్యక్తి మార్కెటింగ్ పాఠాలు చెప్పాల్సిన వాడు అంటూ ట్వీట్ చేశారు. తన ఆఫీసుకు వెళ్లిన తర్వాత నర్సీరాం గురించి తన సహచరులతో పంచుకున్నాడు.

This business tycoon gifted a Kiosk to this roadside cobbler

ఆఫీసులో తన సీటులో కూర్చొన్న ఆనంద్ మహీంద్ర నర్సీరాంకు ఏదైనా తనవంతుగా చేయాలని భావించాడు. వెంటనే తన సహచరులను పిలిచి నర్సీరాం ఆచూకీ ఎక్కడో కనుక్కోమన్నారు. నర్సీరాంకు ఒక చిన్న షాపులాంటిది ఏదైనా బహూకరిస్తే బాగుంటుందని భావించాడు. అనుకున్నదే తడువుగా ఒక వినూత్నమైన షటర్ ఉన్న షాపును డిజైన్ చేయాల్సిందిగా తన కంపెనీలోని ఉద్యోగులకు సూచించారు. అక్కడి ఇంజనీర్లు భలేగా తయారు చేశారు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లేలా ఆ షాపును డిజైన్ చేశారు. అంతేకాదు ఆనంద్ మహీంద్ర తీసుకున్న ఫోటోలో నర్సీరాం ఎలా అయితే "గాయపడ్డ బూట్లకు ఇక్కడ చికిత్స చేయబడును" అని రాసిఉందో అదే పదాలు అందులో ఉన్నాయి.

నర్సీరాం‌కు కానుకగా ఇవ్వాలనుకున్న కొత్త షాపును వీడియో తీసి ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఈ షాపును తయారు చేసిన డిజైనర్లకు ధన్యవాదాలు తెలుపుతూ వారిని అభినందించారు. త్వరలోనే ఇది నర్సీరాంకు అందజేస్తామని ట్విటర్‌లో ఆనంద్ మహీంద్ర తెలిపారు.

English summary
Executive Chairman of Mahindra Group Anand Mahindra has another great update about the 'shoe doctor' he spotted a few weeks ago. In April, he was left mighty impressed by cobbler Narsi Ram, who advertised his shoe repair shop as a hospital for injured shoes,listing Dr Narseeram as the doctor on duty.His fascination with the 'shoe doctor' didn't stop there. He made his team find the cobbler to help him further. Narsi Ram, who will get now a brand new kiosk designed and manufactured by the team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X