• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈ పరికరంతో క్యాన్సర్‌కు చెక్: డివైస్‌ కనిపెట్టిన బెంగళూరు వ్యక్తి

|

బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్ కనిపెట్టిన క్యాన్సర్ పరికరంకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ గుర్తింపు లభించింది. సైటోట్రాన్ అనే ఈ పరికరంను ఓ ప్రైవేట్ రీసెర్చ్ కేంద్రంలో తయారు చేశారు. క్యాన్సర్ వచ్చిన సమయంలో శరీరమంతా కణాలు పాకకుండా ఈ పరికరం అరికట్టడమే కాకుండా చికిత్స సమయంలో ఈ కణాలను కొవ్వు కణాలుగా మార్చివేస్తుందని చెప్పారు పరిశోధనా కేంద్రం ఛైర్మెన్ డాక్టర్ రాజా విజయ్‌ కుమార్.

చిన్నారి ఆదిరాజ్‌కు బ్లడ్ క్యాన్సర్.. బతకాలంటే మీ సహాయం కోరుతున్నాడుచిన్నారి ఆదిరాజ్‌కు బ్లడ్ క్యాన్సర్.. బతకాలంటే మీ సహాయం కోరుతున్నాడు

 క్యాన్సర్ ట్రీట్‌మెంట్ విధానంలో మార్పులు

క్యాన్సర్ ట్రీట్‌మెంట్ విధానంలో మార్పులు

కొత్తగా కనిపెట్టిన ఈ క్యాన్సర్ పరికరం అందుబాటులోకి వస్తే క్యాన్సర్‌కు జరిగే ట్రీట్‌మెంట్ విధానంలో మార్పులు వస్తాయని వెల్లడించారు. దీన్ని తర్వలోనే అంటే జనవరిలోగా హాస్పిటల్స్‌లో వినియోగించేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్ రాజా విజయ్ కుమార్ చెప్పారు. ఈ పరికరం అయస్కాంత ప్రతిధ్వనిని వినియోగించి కణాలు కణజాలాల పనితీరులో మార్పులు తీసుకొస్తుందని విజయ్ కుమార్ చెప్పారు.

 50 సార్లు కణాలు విభజించబడుతాయి

50 సార్లు కణాలు విభజించబడుతాయి

జీవితంలో ఒక వ్యక్తి శరీరంలో ఉన్న ఏ కణమైనా సరే 50 సార్లు విభజించబడుతాయని చెప్పిన డాక్టర్ విజయ్ కుమార్, ఈ ప్రక్రియ ముగిశాక అక్కడితో ఆగిపోతుందని చెప్పారు. అయితే కణితి కణాల్లో మాత్రం కణాలు 50 సార్లు విభజించబడిన తర్వాత కూడా బ్రేక్ ఉండదని చెప్పారు. ఇలా విడిపోవడం వల్ల నిర్దిష్టమైన పీ -53 ప్రొటీన్ క్రమబద్దీకరణ ఉండకపోవడంతో క్యాన్సర్ పెరగడం ఆగిపోతుందని చెప్పారు.

 రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేసే మెషీన్

రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేసే మెషీన్

దాదాపు 30 ఏళ్ల పాటు పరిశోధనలు చేశాక ఈ పరికరాన్ని కనిపెట్టినట్లు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పరికరం ఎంఆర్‌ఐ స్కానర్ మెషీన్‌లా పోలి ఉంటుంది. ఇది రొటేషనల్ ఫీల్డ్ క్వాంటమ్ న్యూక్లియర్ మేగ్నెటిక్ రెసోనెన్స్ టెక్నాలజీని వినియోగిస్తుందని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ పరికరం పనిచేస్తుంది. అంటే పేషెంట్ పరిస్థితిని బట్టి ప్రొటీన్లు లేదా కణజాలాలను పెంచాలా లేదా తగ్గించాలా అనేది ఉంటుంది.

 పరికరంతో 28 రోజుల పాటు క్యాన్సర్‌కు చికిత్స

పరికరంతో 28 రోజుల పాటు క్యాన్సర్‌కు చికిత్స

ఒక వేళ కణాలను పెంచాలని డాక్టరు భావించి కొత్త కణాలను సృష్టించాలని భావిస్తే దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్ పరికరంలో ఉంటుంది. ఈ పరికరంతో ట్రీట్‌మెంట్‌ను 28 రోజులు ఇస్తారు. ఇది క్యాన్సర్/ట్యూమర్లు అంటే లివర్ , పాంక్రియాస్, బ్రెస్ట్ క్యాన్సర్లు వంటి ఘనరూపం లాంటి వాటికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అదే ద్రవ రూపంలో ఉన్న బ్లడ్ క్యాన్సర్లకు ఈ పరికరం పనిచేయదు. అంతేకాదు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని డాక్టర్ విజయ్ కుమార్ ధృవీకరించారు.

 పరికరంను ఆమోదించిన పలు దేశాలు

పరికరంను ఆమోదించిన పలు దేశాలు

యూరోప్, మెక్సికో, అమెరికా, మలేషియా గల్ఫ్ దేశాల్లో ఈ పరికరంకు అక్కడి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో కూడా క్లియరెన్స్ కోసం పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ పరిశోధనా కేంద్రం భారత్‌లోని హాస్పిటల్స్‌తో చర్చిస్తోందని, ఈ టెక్నాలజీపై వారికి వివరిస్తున్నట్లు చెప్పారు. జనవరి నుంచి అందుబాటులోకి తీసుకువస్తామని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ పరికరం కోసం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పిన డాక్టర్ విజయ్ కుమార్.... మరికొంతమంది హాస్పిటల్ యాజమాన్యాలు నేరుగా పరిశోధనా కేంద్రంకు వచ్చి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అనే విషయంను తెలుసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ పరికరం కచ్చితంగా భారత్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి ఒక వరంలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
A Bengaluru-based medical engineer has claimed that a device he invented has been designated a 'breakthrough' tag by the American Food and Drug Administration Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X