వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలీ అకౌంట్‌లో రూ.10వేల కోట్లు పడ్డాయి! ఎలా వచ్చాయి?

మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అంబరం అనే దినసరి కూలి అకౌంటులో ఒక్కసారిగా రూ.9,9000 కోట్లు పడ్డాయట. అయితే, అవి అనుకోకుండా అతని అకౌంటులో పడ్డాయి.

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అంబరం అనే దినసరి కూలి అకౌంటులో ఒక్కసారిగా రూ.9,9000 కోట్లు పడ్డాయట. అయితే, అవి అనుకోకుండా అతని అకౌంటులో పడ్డాయి. అంబరం కూలీ పనులు చేసుకుంటూ బ్యాంకులో డబ్బులు దాచుకుంటాడు. అతని బ్యాంకు అకౌంటులో రూ.1500 జమ అయ్యాయి.

వాటిలో నుంచి రూ.500 విత్ డ్రా చేసి తన కూతురు కాలేజీ ఫీజులు కట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ రూ.500 విత్ డ్రా చేశాడు. అదే సమయంలో తన అకౌంటులో రూ.9,900 కోట్లు ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు.

This Daily Wage Labourer Turned into a Billionaire Overnight when his Bank Account Reflected Rs. 90 Billion from Rs 1500!

వెంటనే ఈ విషయాన్ని అతను బ్యాంకు అధికారులకు తెలిపాడు. విషయం తెలిసిన బ్యాంకు సిబ్బంది అతని అకౌంటును సీజ్ చేశారు. అయితే, అంత మొత్తం అతని అకౌంటులోకి ఎలా వచ్చిందో అధికారులు విచారణ జరుపుతున్నారు. నగదు మార్పిడి, డిపాజిట్, విత్ డ్రా‌లు జరుగుతున్నందున అతని అకౌంటులో ఎవరైనా జమ చేశారా అన్న కోణంలోను విచారిస్తున్నారు. లేదా సాంకేతిక లోపం కారణంగా అకౌంటులో జమ అయిందా తెలుసుకుంటున్నారు.

English summary
This Daily Wage Labourer Turned into a Billionaire Overnight when his Bank Account Reflected Rs. 90 Billion from Rs 1500!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X