వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రైతు విజయ్ మాల్యా కాదు!: ట్రాక్టర్ సీజ్, సూసైడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: లోన్ రికవరీ ఏజెంట్లు తన ట్రాక్టర్ తీసుకు వెళ్లడంతో అవమానంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని దానిని కట్టకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయే విజయ్ మాల్యా వంటి వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం సమయంలో, రూ.7 లక్షలు అప్పు తీసుకుని, అందులో రూ.5.10 లక్షలు చెల్లించి కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రైతుకు.

This farmer is no Vijay Mallya – he committed suicide after loan recovery agents seized his tractor

ఈ సంఘటన తమిళనాడులోని అరియలూరులో జరిగింది. ఓ ప్రయివేటు సంస్థ నుంచి రుణం తీసుకున్న అళగర్ అనే రైతును నడిరోడ్డుపై పోలీసులు చావగొట్టి అతని ట్రాక్టర్‌ను రుణ బకాయి కింద తీసుకు వెళ్లారు. దీంతో ఊరి ప్రజల ముందు తన పరువు పోయిందని భావించిన ఆళగిర్ పురుగుల మందును తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

పంట నష్టపోయినందునే తన కుమారుడు రుణ బకాయి చెల్లించలేకపోయాడని, దాదాపు 100 మంది చూస్తుండగా కొట్టుకుంటూ తీసుకువెళ్లారని, ఇప్పుడు డబ్బు తిరిగి ఇస్తే, తన కొడుకును వెనక్కిస్తారా? అని అళగిర్ తండ్రి కంటతడి పెట్టారు.

English summary
Even as business tycoon and now 'absconder' Vijay Mallya continues to elude Indian agencies after defaulting on thousands of crores of loans, a farmer in Tamil Nadu's Ariyalur district was forced to commit suicide just because he could not pay Rs 1.9 lakhs in loan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X