వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 ఎన్నికల్లో హైయ్యెస్ట్ మెజార్టీ : 6.96 లక్షల ఓట్ల తేడాతో పాటిల్ జయభేరీ

|
Google Oneindia TeluguNews

ముంబై : సార్వత్రిక ఎన్నికల్లో మరో ఫీటు రికార్డైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రికార్డు మెజార్టీతో అధికారం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత మెజార్టీ కూడా ఈ ఎన్నికల్లో నమోదైంది. గుజరాత్ నవ్ సర్ లోక్ సభ నియోజకవర్గంలో ఈ రికార్డు నమోదైంది.

 6.96 లక్షల ఓట్ల మెజార్టీ

6.96 లక్షల ఓట్ల మెజార్టీ

రెండోసారి ప్రధాని పదవీ చేపట్టబోతోన్న నరేంద్ర నరేంద్ర మోడీ 4.97 లక్షల మెజార్టీ రాగా .. బీజేపీ రథసారతి అమిత్ షా 5.57 లక్షల ఓట్ల తేడాతో ముందువరుసలో ఉన్నారు. దేశంలో అత్యధిక మెజార్టీ సాధించారు గుజరాత్ లోని నవ్ సారీ నియోజకవర్గ ఎంపీ సీఆర్ పాటిల్. తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మేశ్ భాయి పటేల్ పై 6.9 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడినుంచి ఆయన వరసుగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో కూడా 5.58 లక్షల మెజార్టీతో దూసుకెళ్లారు పాటిల్.

కానిస్టేబుల్ టు పొలిటిషియన్

కానిస్టేబుల్ టు పొలిటిషియన్

మహారాష్ట్రలోని జలాగన్ జిల్లా పాటిల్ స్వస్థలం. ఆయన పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసి .. రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాదు 1989లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం బీహార్ విభాగం బీజేపీ ఇంచార్జీగా వ్యవహరి్సతున్నారు. ఇక నవ్ సారీ నియోజకవర్గంలో మరాఠీలో ఎక్కువ .. తాను కూడా మరాఠా కావడంతో ఆయనకు రికార్డు మెజార్టీ సాధ్యమైంది. ఇటు లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆస్తులు కూడా ఎక్కువే. అత్యంత ధనవంతుల్లో పాటిల్ కూడా ఒకరు. 74.47 కోట్ల ఆస్తులతో ధనవంతుల జాబితాలో ముందువరుసలో ఉన్నారు.

విజయాలు .. వివాదాలు ...

విజయాలు .. వివాదాలు ...

అయితే అతను కానిస్టేబుల్ గా ఉన్న సమయంలో లిక్కర్ కేటాయింలపు వ్యవహారంలో ప్రమేయంపై విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. డైమండ్ జూబ్లి కోఆపరేటివ్ బ్యాంకు స్కాంలో కూడా 2002లో పోలీసులు పాటిల్ ను అరెస్ట్ చేశారు. బ్యాంకుకు రూ.54 లక్షల లోన్ తీసుకొని ఇవ్వకపోవంతో ఆ బ్యాంకు దివాళ తీసింది.

వారణాసిలో ప్రచారం

వారణాసిలో ప్రచారం

అంతేకాదు వారణాసి నియోజకవర్గం కోసం సమయం కేటాయించారు. మోదీకి రికార్డు మెజార్టీ రావడానికి కూడా పాటిల్ వ్యుహలు కారణం. తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే వారణాసికి కూడా సమయం కేటాయించారు పాటిల్. 24 ఏప్రిల్ నుంచి మే 17 వరకు అక్కడే ఉండి ఓటర్లను బీజేపీ వైపు తిప్పడంలో కీ రోల్ పోషించారు.

English summary
Their victory numbers, however, pale in front of those managed by C.R. Patil, the BJP candidate from South Gujarat’s Navsari constituency. Patil, a two-time MP from Navsari, won a third term Thursday beating the Congress’ Dharmeshbhai Patel by 6.9 lakh votes. Patel’s victory is the highest winning margin in this Lok Sabha election. The BJP candidate improved on his 2014 performance when he had won the constituency by 5.58 lakh votes. Patil’s victory margin nearly beat the highest ever in Indian electoral history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X