వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి...నెటిజెన్ల మనస్సును గెల్చుకుంది ఆ కుటుంబం

|
Google Oneindia TeluguNews

గుజరాత్ : గుజరాత్‌లో ఓ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు ఎలా అయితే తన వివాహం జరగాలని కోరుకున్నాడో అంతకంటే గ్రాండ్‌గా చేసింది ఆ కుటుంబం. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి. పెళ్లిని చూసి వధూవరులను ఆశీర్వదిస్తామనుకున్న వారు మాత్రం షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఆ షాక్ ఏమిటి... ?

గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనే కల

గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనే కల

గుజరాత్‌లో అజయ్ అనే 27 ఏళ్ల యువకుడు తన పెళ్లిపై చాలా గొప్పగా కలలు కన్నాడు. చాలా గ్రాండ్‌గా చేసుకోవాలని భావించాడు. ఆయన కోరిక ప్రకారమే అతని కుటుంబ సభ్యులు పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. అయితే ఈ పెళ్లిలో పెళ్లికూతురు లేదు. ఇదే పెళ్లికి వచ్చిన అతిథులను షాక్‌కు గురిచేసింది.

పెళ్లి కూతురు లేకుండానే గ్రాండ్‌గా పెళ్లి

పెళ్లి కూతురు లేకుండానే గ్రాండ్‌గా పెళ్లి

అసలు విషయం ఏమిటంటే అజయ్‌కు కొన్ని ఆరోగ్యపరంగా మానసిక సమస్యలున్నాయి. అతని ఊర్లో ఏ పెళ్లి జరిగినా అజయ్ అక్కడ వాలిపోయేవాడు. ఆ డప్పుల శబ్దానికి డ్యాన్స్ కూడా చేసేవాడు. ఇలా తన మనసులో పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా బలంగా నాటుకుపోయింది. తన తల్లిని చిన్నతనంలోనే కోల్పోయినందున... మరింత డిప్రెషన్‌కు లోనయ్యాడు అజయ్. ఇక తన పెళ్లి ఎప్పుడు చేస్తారు.. గ్రాండ్‌గా చేయాలని పదేపదే తన తండ్రి వద్ద చెప్పేవాడట. ఇక అజయ్‌కు పిల్లను ఇచ్చేవారు లేకపోవడంతో అజయ్ కన్న కలను నెరవేర్చాలని కుటుంబ సభ్యులు భావించారు.

గుజరాతీ సాంప్రదాయం ప్రకారమే వివాహం

గుజరాతీ సాంప్రదాయం ప్రకారమే వివాహం

ఇక గుజరాతీ సాంప్రదాయంలో వివాహాన్ని ఎలా జరిపిస్తారో అలానే తన వివాహ తంతును పూర్తి చేశారు. ముందుగా ఆహ్వాన పత్రికలు బంధువులకు అందరికీ పంపారు. సంప్రదాయం ప్రకారమే పెళ్లి కొడుకును చేశారు. మంచి శర్వాణీలో పెళ్లికొడుకు చాలా అందంగా కనిపించాడు. మెడలో తెల్లటి రోజాపూలతో మాల ధరించాడు. ఇక పెళ్లికొడుకును గుర్రంపై కూర్చోబెట్టి భారీ ఊరేగింపు చేశారు. దారి మధ్యలో డ్యాన్స్‌లతో బారాత్ అదిరిపోయింది. ఇక ఈ వేడుకకు 200 మంది అతిథులు హాజరయ్యారు. గుజరాతీ మ్యూజిక్‌కు స్టెప్పులు వేశారు. అనంతరం పురోహితుడి సమక్షంలో వధువు లేకుండానే వేదమంత్రాల మధ్య పెళ్లి వేడుక ముగిసింది. అనంతరం 800 మందికి సరిపడా విందు భోజనం అరేంజ్ చేశారు.

నెటిజెన్ల మనసును గెల్చుకున్న కుటుంబం

పెళ్లి చేసుకోవాలన్న తన కోరిక విన్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగేదని తండ్రి పేర్కొన్నాడు. మానసికంగా సరిగ్గా లేని అజయ్‌కు అమ్మాయి దొరకడం చాలా కష్టమని అయినప్పటికీ తన కోరిక నెరవేర్చాలన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులందరితో మాట్లాడి ఈ వేడుక ఘనంగా నిర్వహించామని చెప్పాడు. అజయ్ కథ సోషల్ మీడియాలో పోస్టు కాగానే చాలామంది రియాక్ట్ అయ్యారు. నెటిజెన్లు ఈ స్టోరీని చదివి భావోద్వేగానికి గురయ్యారు. అజయ్ కోరికను నెరవేర్చిన కుటుంబ సభ్యులను అభినందించారు.

English summary
A wedding in Gujarat has won many hearts. Ajay with learning disabilities had a wish that his marriage be done in a grand style. His family members completed the ceremony with all rituals but without a bride.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X