వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ గుళ్లో మీ పాపం పోతుంది!!: కావాలంటే సర్టిఫికేట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

జైపూర్: చాలామంది దేవుడిని నమ్ముతారు. దేవుడికి మొక్కుకుంటే పాపాలు హరించుకుపోతాయని భావిస్తారు. ఎవరి నమ్మకం వారిది. అయితే, రాజస్థాన్‌లోని ఓ దేవాలయంలోకి వెళ్తే.. అక్కడ కచ్చితంగా పాపాలు పోతాయట! అలా అని అక్కడి వారిలో కొందరు సర్ఠిఫికేట్ ఇవ్వడం గమనార్హం.

ఈ ఆళయం రాజస్థాన్‌లో ఉంది. ఇది శివాలయం దీనిని గౌతమేశ్వర మహదేవ పాపవిమోచన తీర్థ అని పిలుస్తారు. భక్తులు ఇక్కడి మందాకిని కుంద్‌లో మునిగి పాపపరిహారం చేసుకుంటారు. అంత వరకు పరవాలేదు.

This Hindu temple in Rajasthan gives ‘sin-free’ certificates for Rs 11

కానీ, ఇక్కడి ఆలయ సమీపంలో ఓ గ్రూప్ ఉంది. వారు పది రూపాయలను తీసుకొని దోష నివారణ పూజ చేస్తారు. అలాగే ఓ సర్టిఫికేట్ ఇస్తారు. దానికి రూ.1 వసూలు చేస్తారు. మొత్తం పదకొండు రూపాయలకు పాపాలు పోయినట్లుగా ఆ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం.

పాపాలు చేసినవారు, బహిష్కరణకు గురైన వారు ఇక్కడకు వచ్చి స్నానం ఆచరించి, ఆ తర్వాత సర్టిఫికేట్ పొందితే చాలునని సదరు గ్రూప్ చెబుతోంది. ప్రతి మే నెలలో ఇక్కడకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివుడిని దర్శించుకుంటారు. అయితే, ఈ సర్టిఫికేట్ మాత్రం ఓ గ్రూప్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Strange as it may sound, many Hindus in India believe in taking a holy dip to absolve themselves of the ‘sins’ they think they have committed. However, this Hindu temple in Rajasthan’s Pratapgarg district gives people a ‘sin-free’ or ‘paap-mukt’ certificate after they take a holy dip, says a Times of India report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X