వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కన్నీళ్ల శాపమే నీకు తగిలింది : జయప్రద

|
Google Oneindia TeluguNews

తనను అవమానాలకు గురి చేసిన ఎంపీ అజాంఖాన్‌‌కు తగిన శాస్తి జరిగిందని బీజేపీ నేత నటి జయప్రద అన్నారు. రాంపూర్‌ పార్లమెంట్ ఎన్నికల్లో ఆజాంఖాన్, మరియు జయప్రద ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలోనే ఆజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు జయప్రద గతంలో బహిరంగానే కంటతడి పెట్టింది. దీంతో తనను ఏడిపించిన ఆజాంఖాన్‌కు ఇదే పరిస్థితి రావడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఏడిపించినందుకే ఆజాంఖాన్‌ కూడ కేసుల్లో ఇరుక్కున్నారని వ్యాఖ్యానించింది. ఆయనకు మహిళల శాపం తగిలిందని జయప్రద అన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఏడ్చిన అజాంఖాన్

ఎన్నికల ప్రచారంలో ఏడ్చిన అజాంఖాన్

రాంపూర్‌లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఎంపీ ఆజాంఖాన్ భార్య తజీన్ ఫాతిమా పోటి చేస్తోంంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయనపై వచ్చిన ఆరోపణలపై బోరున విలపించాడు. ఎన్నికల ప్రచార సభలోనే ఆయన కంటతడి పెట్టారు. ఎంపీగా ఉన్న తనపై కోళ్లు, పశువులు దోంగతనం చేశారని పలుకేసులు నమోదయ్యాయి. దీంతో తాను కోళ్లు దోంగతనం చేసేవాడిలా కనిపిస్తున్నానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో ఏడ్చిన జయప్రద

గత ఎన్నికల్లో ఏడ్చిన జయప్రద

అయితే ఎంపీ ఆజాంఖాన్ ఏడుపును నటి జయప్రద తన విమర్శలకు అనుకూలంగా మార్చుకుంది. గత ఎన్నికల్లో ఆజాంఖాన్ తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని, రాజకీయంగా తన కేరీర్‌ను నాశనం చేయాలని చూశారని ఆమే ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆనేక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పిన జయప్రద ఇప్పుడు ఆయనకు కూడ అదే గతిపట్టిందని చెప్పారు. ఆయనకు మహిళలను ఏడిపించినందుకు సరైన శాస్తి జరిగిందని అన్నారు.

భూకబ్జాలతోపాటు అజాంఖాన్‌పై 80 కేసులు

భూకబ్జాలతోపాటు అజాంఖాన్‌పై 80 కేసులు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంపీ ఆజాంఖాన్‌ పై మొత్తం 80 కేసులు నమోదు చేసింది. ఇందులో పలు రకాల కేసులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా భూకబ్జాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. నమోదైన కేసుల్లో 29 భూకబ్జా కేసుల్లో ముందస్తు బెయిల్ కూడ కోర్టు నిరాకించిన పరిస్థితి నెలకోంది.. ఇాలా ఇప్పటివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులు, పుస్తకాల చోరీ కేసులు, వక్ఫ్ భూముల ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. అందులో ఇంట్లో చొరబడి 25000 వేల రుపాయాలతో పాటు పాలిచ్చే గేదేలను దొంగిలించాడని క్రిమినల్ కేసు నమోదైంది. తాజాగా మూడు రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్ మాఫియా నేరస్థుల ఆన్‌లైన్ లిస్టులో ఆజాంఖాన్ పేరు కూడ చేర్చడం గమనార్హం.

English summary
This is a curse of the tears women have shed to mp ajam khan. He is now crying in every public meeting. Jaya Prada said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X