వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: రూ.1,590 చెల్లించి కోటి గెలుచుకొన్నాడు, ఎలాగంటే?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహకాల్లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమర్ కు కోటి రూపాయాల బంపర్ ప్రైజ్ దక్కింది.మొత్తం ఆరుగురు లబ్దిదారులను డ్రా ద్వారా ఎంపిక చ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహకాల్లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమర్ కు కోటి రూపాయాల బంపర్ ప్రైజ్ దక్కింది.మొత్తం ఆరుగురు లబ్దిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి నిలయంలో ఈ మేరకు డ్రా తీశారు. ముగ్గురు వ్యాపారులను, ముగ్గురిని సాధారణ ప్రజలను డ్రా ద్వారా ఎంపిక చేశారు.

This is how a bank customer won Rs 1 crore lottery on digital payment

డిజిటల్ పేమెంట్ చేసిన ఆరుగురిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. వినియోగదారుల విభాగంలో కోటి రూపాయాల మెగా ప్రైజ్ ను సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన కస్టమర్ దక్కించుకొన్నాడు.

ద్వితీయ బహుమతి 50 లక్షలను బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన కస్టమర్ గెలుచుకొన్నాడు. మూడవ బహుమతి రూ.25 లక్షలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ గెలుచుకొన్నాడు.

ముగ్గురేసి చొప్పున లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార్ యోజన పథకాల కింద డ్రా ద్వారా ఎంపిక చేశారు. అయితే ఈ ముగ్గురు బ్యాంకు కస్టమర్లు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ ముగ్గురు కూడ రూపే కార్డుల ద్వారా తమ పేమెంట్లు చేశారు.ఈ కార్డుల చెల్లింపుల ఆధారంగా లబ్దిదారులను గుర్తించనున్నారు.

ఈ నెల 14వ, తేదిన అంబేద్కర్ జయంతి రోజున నాగపూర్ లో నిర్వహించే సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజేతలను సన్మానించనున్నారు.

నగదు రహిత భారత్ కు ప్రజలు మద్దతు ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు.దీర్ఘకాలంలో ఇండియా నగదు రహిత భారత్ గా మారనుందన్నారు.

English summary
A transaction of Rs 1,590 has bagged a Central Bank of India customer lucky bounty of Rs 1 crore under the government's promotional scheme to popularise digital payments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X