• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే...స్వచ్ఛభారత్‌తో ఆరోగ్య భారత్‌ను నిర్మిద్దాం

|

రెండేళ్ల క్రితం శిశు మరణాల సంఖ్య ఏడాదికి 10 లక్షలు ఉండగా అది 2017 నాటికి 8,02000కు తగ్గింది. అంటే దాదాపు 2లక్షల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడగలిగాం. కొన్ని జాగ్రత్తలు పాటించకుండా ఉండి ఉంటే... ఈ 2లక్షల పిల్లలు కూడా కొన్ని వ్యాధులతో మృతి చెందేవారు. సురక్షిత తాగు నీరు, చేతులు శుభ్రపరుచుకోవడం, పరిశుభ్రమైన ఆహారం, మరుగుదొడ్ల నిర్మాణంలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా మటుకు అంటు వ్యాధులు తగ్గి చిన్నపిల్లలు ప్రాణాలతో ఉన్నారని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది.

Swachh Bharat

పరిసరాల పరిశుభ్రత లేక, సురక్షితంగా లేని మంచినీరు తాగటం వలన 88శాతం పిల్లలు డయేరియా బారిన పడే అవకాశం ఉంది. దీంతో దీర్ఘకాలిక పోషకాహారలోపం, రోగనిరోధక శక్తి తగ్గటం, న్యూమోనియా, ట్యూబర్‌కులోసిస్ లాంటి ఇన్ఫెక్షన్లు సోకడం జరుగుతాయి. దీనిపై యుద్ధం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్శల్ ఇమ్మ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించింది. పిల్లల్లో ప్రబలతున్న వ్యాధులను కట్టడి చేసేందుకు కొత్తగా ఆరు వ్యాక్సిన్లు ప్రవేశపెట్టారు.

అందులో న్యూమోనియాకు చెక్ పెట్టేందుకు న్యూమోకల్ వ్యాక్సిన్, డయేరియాను కట్టడిచేసేందుకు రోటావైరస్ వ్యాక్సిన్‌లను ప్రవేశపెట్టారు. దీంతో సాధారణంగా పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్లు వాటి నుంచి వీరు మృతి చెందుతున్నారు. కొత్తగా వచ్చిన వ్యాక్సిన్‌లతో జబ్బులకు చెక్ పెట్టి చిన్నారులను కాపాడుతున్నారు. అయితే 2015లో పుట్టిన ప్రతి 1000మంది శిషువుల్లో 43 మంది మృతి చెందుతుండగా..2016లో అది 39కి పడిపోయింది. ఇదంతా కేవలం ప్రధాని మోడీ మానసపుత్రిక ప్రాజెక్ట్ స్వచ్చ్ భారత్‌తోనే సాధ్యపడింది. పరిసరాలు శుభ్రపరచడం, 2019 కల్లా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి బహిర్భూమిని చెక్ పెట్టాలనే యోచనలో కేంద్రం ఉంది.

Swachh Bharat

2014 నుంచి ఇప్పటి వరకు 85.2 మిలియన్ మరుగుదొడ్ల నిర్మాణం

2014లో స్వచ్చ్ భారత్ కార్యక్రమం అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు గ్రామీణ భారత్‌లో 85.2 మిలియన్ మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. దేశవ్యాప్తంగా ఉన్న 718 జిల్లాల్లో 459 జిల్లాలు బహిర్భూమి లేని జిల్లాలుగా కేంద్రం ప్రకటించింది. అంటే అక్కడ పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. దీంతో పరిశుభ్రత మెరుగుపడి జబ్బులు తగ్గి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం. కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లోని 10 జిల్లాల్లో చేపట్టిన సర్వేల్లో బహిర్భూమికి గుడ్‌బై చెప్పి మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడంతో అక్కడ పిల్లలకు వచ్చిన జబ్బుల శాతం మరుగుదొడ్లు లేని గ్రామాల్లో ఉన్న పిల్లలకు వచ్చే జబ్బులకంటే చాలా తక్కువగా నమోదైనట్లు వెల్లడైంది.

మరుగుదొడ్లు వినియోగిస్తున్న తల్లులు ఆరోగ్యకరంగా ఉన్నారు: సర్వే

మరుగుదొడ్లలో కాకుండా బయట పొలాల్లో లేదా బహిరంగప్రదేశాల్లో విసర్జన చేయడం వల్ల అక్కడి నీరు, ఆహారం కలుషితం అవుతుందని సర్వే వెల్లడించింది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులు విసర్జన సమయంలో వచ్చే సూక్ష్మ పురుగుల వల్ల మట్టి, నీరు ఆహారం కలుషితం అయి ఇతరులకు వ్యాధులు అంటుకునే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. అంతేకాదు బహిర్భూమికి చెక్ పెట్టిన జిల్లాల్లో 62.5శాతం మంది తల్లులు ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నారని అదే మరుగుదొడ్లు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేసేవారి జిల్లాల్లో 57.5శాతం మంది తల్లులే ఆరోగ్యకరంగా ఉన్నట్లు సర్వే తెలిపింది.

పైపు లైను ద్వారా మంచినీరు తాగే వారిలో 14.7శాతం డయేరియా కేసులు

పైపు ద్వారా నీరు తాగే వారిలో ఇన్‌ఫెక్షన్ శాతం తక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. పైపు లైను ద్వారా మంచి నీరు తాగే వారిలో కేవలం 14.7శాతం డయేరియా కేసులు బయటపడ్డాయి. ఇతర మార్గాల్లో నీరుతాగే వారిలో అంటే హ్యాండ్ పంపులు, బోరుబావులు, బావులు, బహిరంగ ప్రదేశాల్లో లభించే తాగునీరు, చెత్త చెదారం మూసివేయని ప్రదేశాల్లో లభించే తాగునీరు, విసర్జన ప్రాంతాల్లో లభించే తాగునీరు తాగిన వారిలో 85.3శాతం ఇన్ఫెక్షన్లు సోకినట్లు గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ దిలీప్ మవలాంకర్ తెలిపారు.

పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది. పరిశుభ్రతపై చాలా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌లో సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు డాక్టర్ సంగీత భట్టాచార్య . అంగన్‌వాడీ స్కూళ్లలో సబ్బు నీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. భారత్ పారిశుద్ధ్యంలో ఇదివరకటిలా కాకుండా గాడిలో పడిందని చెప్పారు. 2019కల్లా మరింత అవగాహన తీసుకొచ్చి అంటువ్యాధుల బారినుంచి ప్రజలను కాపాడుకోవచ్చని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The number of deaths of children under the age of five in India declined to 802,000 in 2017 from around 1 million two years ago. That means close to 200,000 lives have been saved – these are children who would have otherwise been lost to preventable and treatable diseases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more